రాశిఫలాలు 22-05-2022 నుండి 28-05-2022 వరకు
By జ్యోత్స్న Published on 22 May 2022 2:27 AM GMT
మేష రాశి : ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి.జీవిత బాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి.పర...