స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సీహెచ్‌ఎస్‌ఎల్ - 2025 నోటిఫికేషన్ ద్వారా 3,131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్ అర్హత గల అభ్యర్థులు జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థనుల టైర్ 1, టైర్ 2 పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. టైర్ 1 పరీక్ష సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు, టైర్ 2 పరీక్షలు ఫిబ్రవరి, మార్చి 2026 మధ్య నిర్వహించనున్నారు.
టైర్ 1 పరీక్ష 100 ప్రశ్నలు 200 మార్కులు, పరీక్ష వ్యవధి గంట. ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
టైర్ 2 పరీక్షను 2 సెషన్లలో నిర్వహిస్తారు. మొదట సెషన్ సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 60 ప్రశ్నలకు 180 మార్కులు. పరీక్ష సమయం గంట. రెండో సెక్షన్‌లో 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్ నుంచి 40, జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. పరీక్ష సమయం గంట. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలకు 45 మార్కులు. పావుగంట సమయం ఇస్తారు. సెషన్ 2లో స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ పావుగంట ఉంటుంది.