FactCheck : పాట్నాలో రాహుల్ గాంధీతో వేదికను పంచుకోకపోవడంతో పప్పు యాదవ్ ఏడ్చేశారా?

జూలై 9న, రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ పార్టీలు కలిసి నిరసన ప్రదర్శన చేపట్టాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 12 July 2025 3:11 PM IST

FactCheck : పాట్నాలో రాహుల్ గాంధీతో వేదికను పంచుకోకపోవడంతో పప్పు యాదవ్ ఏడ్చేశారా?

జూలై 9న, రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ పార్టీలు కలిసి నిరసన ప్రదర్శన చేపట్టాయి. బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ల జాబితాలను నిరసిస్తూ తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ వంటి నాయకులతో కలిసి ర్యాలీని నిర్వహించాయి.

ర్యాలీ సందర్భంగా, రాహుల్ గాంధీ మెట్లు ఎక్కిన వెంటనే పూర్ణియా లోక్‌సభ ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్), కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్‌లను ఎక్కకుండా ఆపినట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. అంతకుముందు, RJD నాయకుడు తేజస్వి యాదవ్‌తో సహా ఇతరులను వాహనంపై అమర్చిన ప్లాట్‌ఫారమ్‌పైకి అనుమతించారు.

ఈ సందర్భంలో, మీడియాతో మాట్లాడుతూ పప్పు యాదవ్ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీతో వేదికను పంచుకోవడానికి అనుమతించకపోవడంతో ఏడ్చినట్లుగా పోస్టులు తెలిపాయి. వీడియోలో యాదవ్ తనపై దాడి జరిగిందని కూడా చెప్పడం వినవచ్చు.

ఒక X యూజర్ వీడియోను షేర్ చేసి, “పప్పు యాదవ్ రాహుల్ గాంధీతో వేదికపైకి ఎక్కడానికి అనుమతించలేదు. దీంతో పప్పు యాదవ్ ఏడవడం ప్రారంభించాడు” అని రాశారు.



నిజ నిర్ధారణ:

ఈ వీడియోకు జూలై 9 ర్యాలీకి సంబంధం లేనిది. 2018 నాటిది కాబట్టి, వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేదని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా సెప్టెంబర్ 6, 2018న ABP న్యూస్, ది క్వింట్, లైవ్ సిటీస్ కు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లలో పప్పు యాదవ్ మీడియా ముందు విలపిస్తున్నట్లు చూపించే అదే ఫుటేజ్ మాకు కనిపించింది.

ఈ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ర్యాలీ నిర్వహించడానికి వెళుతుండగా యాదవ్ పై దాడికి దిగారు. దీంతో ఆయన కెమెరా ముందు భావోద్వేగానికి గురయ్యాడు.

సెప్టెంబర్ 6, 2018న Xలో యాదవ్ షేర్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. Y-కేటగిరీ భద్రత ఉన్న ఎంపీపై తుపాకీతో దాడి జరిగినప్పుడు సాధారణ పౌరులు ఎలా సురక్షితంగా ఉండగలరని ఆయన ప్రశ్నించారు. నారి బచావో పాదయాత్ర సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దేశాన్ని జాతి, మతపరమైన అశాంతి వైపు నెట్టివేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

సెప్టెంబర్ 6, 2018న నారీ సురక్ష పాదయాత్రలో పప్పు యాదవ్ పై పిస్టల్స్, లాఠీలతో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆజ్ తక్, దైనిక్ భాస్కర్, NDTV నివేదించిన సంఘటనను కూడా మేము కనుగొన్నాము. ఆ తర్వాత ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ, CRPF రక్షణ లేక పోయి ఉంటే తనను చంపేసేవారని అన్నారు.

ఇటీవలి ఘటనపై యాదవ్ స్పందన ఏమిటి?

సంఘటన జరిగిన కొద్దిసేపటికే యాదవ్ NDTVతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను విమర్శించడం మానేశారు.

“ప్రజలు నన్ను మౌనంగా ఉండాలని కోరుకుంటున్నారు” అని ఆయన అన్నారు. “నేను వారి కోసమే మౌనంగా ఉన్నాను. నేను ప్రతిరోజు 24 గంటల్లో 23 గంటలు బీహార్ ప్రజలకు అంకితం చేస్తున్నాను. నా దగ్గర ఏమీ లేదు. నేను పేదల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను.” తెలిపారు.

కాబట్టి, పప్పూ యాదవ్ మీడియాకు విలపిస్తున్న వైరల్ వీడియో 2018 నాటిదని మేము నిర్ధారించాము. జూలై 9 ర్యాలీకి లింక్ చేసిన వాదనను తప్పుదారి పట్టిస్తున్నారు.

Credits : Md Mahfooz Alam

Claim Review:పాట్నాలో రాహుల్ గాంధీతో వేదికను పంచుకోకపోవడంతో పప్పు యాదవ్ ఏడ్చేశారా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story