అలర్ట్..హైదరాబాద్‌లో ఇక నుంచి డే టైమ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు

By Knakam Karthik
Published on : 17 July 2025 8:22 AM IST

Hyderabad News, Drunk Driving, Traffic Alert, Hyderabad Traffic Police

అలర్ట్..హైదరాబాద్‌లో ఇక నుంచి డే టైమ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక నుంచి డే టైమ్ లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ సిటీలో డే టైమ్‌లో ట్రాఫిక్​ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్​ డ్రైవ్ తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్​ సిటీ ట్రాఫిక్​ పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీ చేపట్టినట్లు చెప్పారు. డ్రంక్ అండ్​ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్ మాత్రమే చేస్తారు అనే భావనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ట్రాఫిక్ కంజేషన్ ఉంటుంది అని నైట్ టైం చేస్తామన్నారు. జూన్ నెలల్లో డ్రంక్ అండ్​ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో స్కూల్ బస్ డ్రైవర్​లు మద్యం సేవించి పట్టుబడ్డారని వెల్లడించారు.

అలాగే డ్రంక్​ అండ్​ డ్రైవ్​ వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి ఆలోచించినప్పుడు, ఉదయం వేళల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే రద్దీ లేని ప్రాంతాల్లో మాత్రమే ఈ తనిఖీలను చేపడతారు. వివిధ ప్రాంతాల్లో సమయం చూసుకుని ఎప్పుడు తనిఖీసు చేస్తామని తెలియకుండా ఉన్నట్లుండి తనిఖీలు చేపడతాం. దీంతో పాటు ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే కేసులను తగ్గించవచ్చు అన్న అంశంపై చర్చించినట్లు తెలిపారు. మున్ముందు ఇంకొన్ని చర్యలు చేపడతామన్నారు. బస్, వ్యాన్, ఆటో డ్రైవర్లు ఉదయం వేళలో మద్యం సేవించి వాహనాలు నడుపుతునట్లు గుర్తించామని, అందుకే ఉదయం కూడా కొన్ని ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు లేకుండా ఈ సర్‌ప్రైజ్ డే డ్రంక్ అండ్​ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.

Next Story