పాకిస్తాన్ అబద్ధాలు బట్టబయలు.. మసూద్ అజార్ కొత్త లొకేషన్ అక్క‌డే..!

పుల్వామా దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొత్త లొకేషన్ వెల్లడైంది.

By Medi Samrat
Published on : 18 July 2025 5:45 PM IST

పాకిస్తాన్ అబద్ధాలు బట్టబయలు.. మసూద్ అజార్ కొత్త లొకేషన్ అక్క‌డే..!

పుల్వామా దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొత్త లొకేషన్ వెల్లడైంది. సమాచారం ప్రకారం.. మసూద్ అజార్ బహవల్పూర్ నుండి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గులాం కాశ్మీర్‌లో కనిపించాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. అతడు పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్తాన్‌లో కనిపించాడని.. అతను ఆ ప్రదేశంలో దాక్కుని ఉండవచ్చని నివేదిక‌లు వెల్ల‌డించాయి.

అంతకుముందు అతను స్కర్డులోని సద్పరా రోడ్ ప్రాంతంలో కనిపించాడు. బహవల్పూర్ మసూద్ అజార్‌కు బలమైన కోట అని నమ్ముతారు. అత‌డికి అక్కడ రెండు స్థావ‌రాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల నుంచే తన కార్యకలాపాలన్నీ సాగిస్తున్నాడు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని, బహవల్‌పూర్‌లోని జైష్ మదర్సాను లక్ష్యంగా చేసుకుంది.

అజహర్ మసూద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం రక్షణ కల్పిస్తుంది. మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండొచ్చని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. ఇటీవల పాక్ ఉగ్రవాద బాధిత దేశంగా పేర్కొంది. మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌లో దొరికితే భారత్‌కు అప్పగిస్తామని కూడా చెప్పారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ విషయాలు చెప్పారు.

ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయారు. ఈ విషయాన్ని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ స్వయంగా ధృవీకరించారు. దాడి తర్వాత, అతడు కూడా ఈ దాడిలో చనిపోతే బాగుండేదని చెప్పాడు.

Next Story