ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి పరిష్కారం కనపడడం లేదు. అయితే ఇటాలియన్ ఫుట్‌బాల్ జట్టు మ్యాచ్‌కు ముందు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించిందని పేర్కొంటూ, పిల్లలు పాలస్తీనా జెండాను పట్టుకుని మైదానంలో ఆటగాళ్లకు హై-ఫైవ్ ఇస్తున్నట్లు చూపించే ఒక చిత్రం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని “ఇటాలియన్ జట్టు ఇంటర్ మిలన్ వారి మ్యాచ్ కు ముందు పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతోంది!” అంటూ పోస్టు చేశారు. (ఆర్కైవ్)
అదే వాదనతో పలు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేదిగా కనుగొంది.
2009లో తీసిన ఈ చిత్రం అసలైన వెర్షన్‌లో, ఇజ్రాయెల్, పాలస్తీనా జెండాలు ధరించిన పిల్లలు ఆటగాళ్లకు హై-ఫైవ్ ఇస్తున్నట్లు చూపిస్తుంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2015లో Rediffలో “Can a ‘peace match’ help Israel and Palestine?” అంటూ పోస్టు పెట్టారు. ఈ చిత్రం అసలైన వెర్షన్ మాకు కనిపించింది. ఈ చిత్రం "ఇజ్రాయెల్, పాలస్తీనా పిల్లలు జెండాలతో ఉన్నారు" అంటూ గెట్టి ఇమేజెస్‌కు క్రెడిట్ చేశారు.
స్టాక్ ఫోటో ఏజెన్సీ గెట్టి ఇమేజెస్ సెప్టెంబర్ 23, 2009న ప్రచురించిన చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. ఈ చిత్రంలో పిల్లలు ఇజ్రాయెల్, పాలస్తీనా జెండాలను పట్టుకుని ఉన్నట్లు చూపిస్తుంది.
వెబ్‌సైట్ ప్రకారం, ఇటలీలోని మిలన్‌లోని స్టేడియో గియుసెప్పీ మీజ్జాలో FC ఇంటర్ మిలన్, SSC నాపోలి మధ్య సీరీ A(Serie A) మ్యాచ్‌కు ముందు ఈ ఫోటో తీశారు. ఇది ఇంటర్ యూత్ క్యాంప్ నుండి ఇజ్రాయెల్, పాలస్తీనా పిల్లలు FC ఇంటర్ మిలన్ ఆటగాళ్లకు హై-ఫైవ్‌లు ఇస్తున్నట్లు చూపిస్తుంది.
FC ఇంటర్ మిలన్- SSC నాపోలి గురించి
FC ఇంటర్ మిలన్, SSC నాపోలి అనేవి ఇటలీలోని రెండు ప్రొఫెషనల్ సాకర్ క్లబ్‌లు. ఇవి దేశంలోని అగ్రశ్రేణి ఫుట్‌బాల్ లీగ్ అయిన సీరీ Aలో ఆడతాయి.
ఒక చిత్రాన్ని ఎడిట్ చేసి తప్పుదారి పట్టించే వాదనతో షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము. ఇటాలియన్ ఫుట్‌బాల్ జట్టు పాలస్తీనాకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నట్లు వైరల్ చిత్రం చూపలేదు.
Credit: Mahfooz Alam