Video : ఛాంబర్ కోసం కొట్టుకున్న మహిళా లాయర్లు

శుక్రవారం నాడు మధుర కోర్టు ప్రాంగణంలో ఇద్దరు మహిళా న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.

By Medi Samrat
Published on : 18 July 2025 9:15 PM IST

Video : ఛాంబర్ కోసం కొట్టుకున్న మహిళా లాయర్లు

శుక్రవారం నాడు మధుర కోర్టు ప్రాంగణంలో ఇద్దరు మహిళా న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ సంఘటనను పక్కనే ఉన్నవారు తమ ఫోన్లలో రికార్డ్ చేయడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో ఇద్దరు న్యాయవాదులు దుర్భాషలాడుతూ, ఒకరి జుట్టు ఒకరు లాగుతూ, బహిరంగంగా గొడవపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక మహిళ జుట్టు పట్టుకుని మరొకరిని కొడుతుండగా, చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇది నా ఛాంబర్ అంటే నా ఛాంబర్ అంటూ ఇద్దరూ కొట్లాడుకోవడం అందులో చూడొచ్చు.

ఈ గొడవలో భాగమైన న్యాయవాదులలో ఒకరైన స్నేహ లత తన మాజీ స్నేహితురాలు, సహోద్యోగిపై నమ్మకద్రోహం, దాడి ఆరోపణలు చేసింది. లా చాంబర్‌ను సంయుక్తంగా ఉపయోగించుకుందామనే ఒప్పందానికి తూట్లు పొడిచిందని, దీంతో వివాదం ప్రారంభమైందని స్నేహ లత ఆరోపించింది. ఈ గొడవ జరిగిందని ఒక పోలీసు అధికారి ధృవీకరించారు. కానీ ఇంకా అధికారికంగా ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పారు. మహిళలు ముందుకు వస్తే, ఈ విషయంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.


Next Story