హెచ్‌సీఏ స్కామ్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్కామ్‌ విషయంలో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి

By Medi Samrat
Published on : 17 July 2025 6:38 PM IST

హెచ్‌సీఏ స్కామ్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్కామ్‌ విషయంలో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌రెడ్డిపై తాజాగా సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్టుకు కూడా సీఐడీ రంగం సిద్ధం చేసింది. దేవ్‌రాజ్‌కు సహకరించిన ఎలక్షన్‌రెడ్డి సీఐడీ సమాచారాన్ని ముందుగానే లీక్‌ చేసినందుకు సస్పెండ్‌ అయ్యారు. హెచ్‌సీఐ అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తముందని, సీఐడీ డీజీ చారుసిన్హాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ అక్రమాల్లో మరికొందరి పాత్ర ఉందని, విచారణ జరిపి జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్‌మోహన్‌ రావు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యారన్నారు.

Next Story