ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ (మ్యాథ్స్) లేదా ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన విద్యార్థులు జులై 11 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ జులై 31. ఇంటర్/ డిప్లొమాలో 50 శాతం మార్కులతో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ చదివి ఉండాలి. అభ్యర్థులు జులై 2, 2005 నుంచి 02, జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు రూ.550. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, 2, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేల చొప్పున అందిస్తారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చేవారికి సేవానిధి ప్యాకేజీ కింద రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.