జార్ఖండ్‌లో ఒక రైలు దాదాపు రెండు గంటల పాటూ ఆగిపోయింది. అందుకు కారణం ఒక అడవి ఏనుగు రైల్వే ట్రాక్‌పై ప్రసవించడమే. కెమెరాలో రికార్డైన ఈ సంఘటన, ఏనుగు, అప్పుడే పుట్టిన బిడ్డ ప్రసవం తర్వాత సురక్షితంగా నడుస్తున్నట్లు చూపిస్తుంది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వీడియోను Xలో షేర్ చేశారు. ఏనుగు తన పిల్లను ప్రసవించడానికి సహాయపడిన వారికి, జార్ఖండ్ అటవీ అధికారులకు ప్రత్యేక ప్రశంసలని ఆయన తెలిపారు.
దేశంలో పలు ప్రాంతాలలో రైల్వే ట్రాకులు అడవుల గుండా వెళుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏనుగులను రైళ్లు ఢీకొన్న ఘటనలు తెలిసి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. అలాంటి సున్నితమైన ప్రాంతాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు గుర్తించాయి.