హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. సీఎం రేవంత్ రెడ్డి 18 నెలల పరిపాలను విమర్శిస్తూ హోర్డింగులను ఏర్పాటు చేశారు. A-Z వరకు స్కామ్‌లు అని ఆరోపణలు చేస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా ఆ ఫ్లెక్సీలలో ప్రభుత్వంలో అవకతవకలు, వైఫ్యలాలు, నిధుల దుర్వినియోగం వంటి విషయాలు జరిగాయని ప్రస్తావిస్తూ అవినీతి పరంపర అనే హెడ్‌లైన్లతో పలు కీలక అంశాలను పొందుపరిచారు.