నాలుగో టెస్టుకు 'కరుణ్ నాయ‌ర్' క‌ష్ట‌మే.? జ‌ట్టులోకి రానున్న స్టార్ బ్యాట్స్‌మెన్‌..!

ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు తన ప్రదర్శనతో మెప్పించలేకపోవడంతో 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో చోటు దక్కించుకోవడం కష్టమేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

By Medi Samrat
Published on : 16 July 2025 8:34 AM IST

నాలుగో టెస్టుకు కరుణ్ నాయ‌ర్ క‌ష్ట‌మే.? జ‌ట్టులోకి రానున్న స్టార్ బ్యాట్స్‌మెన్‌..!

ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు తన ప్రదర్శనతో మెప్పించలేకపోవడంతో 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో చోటు దక్కించుకోవడం కష్టమేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అయితే వారే.. అతనికి మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆలోచించవ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఇప్పటివరకు మూడు టెస్టు మ్యాచ్‌ల ఆరు ఇన్నింగ్స్‌లలో 00, 20, 31, 26, 40, 14 పరుగులు చేసిన కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ తిరిగి జట్టులోకి రావచ్చు అని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ ఈ గణాంకాలను విస్మరించడం చాలా కష్టం.

ఐపీఎల్‌లో అద‌ర‌గొట్టిన స్టార్ బ్యాట్స్‌మెన్ సాయి సుద‌ర్శ‌న్ జ‌ట్టులోకి రానున్న‌ట్లు తెలుస్తుంది. లీడ్స్‌లో జరిగిన తన అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌటైన‌ సాయి సుదర్శన్.. రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసి కొంత‌ సౌకర్యవంతంగా కనిపించాడు. అటువంటి పరిస్థితిలో ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ని మాంచెస్టర్‌లోజ‌రిగే నాలుగో టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడం గురించి మేనేజ్‌మెంట్ ఆలోచిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

అలాగే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద జస్ప్రీత్ బుమ్రా తదుపరి టెస్ట్‌లో విశ్రాంతి తీసుకోవడం ఖాయం. ఎందుకంటే టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి 1-3-5 వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ఫార్ములాను ఫిక్స్ చేసింది. అంటే ఇప్పుడు బుమ్రా ఐదవ టెస్ట్‌లో కనిపిస్తాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అత‌డి స్థానంలో ఎవరు వస్తారో చూడాలి. ప్రసిద్ధ్‌ కృష్ణకు అవకాశం లభిస్తుందా లేక జట్టు మేనేజ్‌మెంట్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా అవకాశం ఇస్తుందా చూడాలి. హెడ్డింగ్లీ టెస్ట్‌లో ప్రసిద్ధ్ చాలా సాధారణ బౌలింగ్ చేశాడు. ఈ కారణంగా అతను మూడవ టెస్ట్ మ్యాచ్ నుండి తొలగించబడ్డాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శార్దూల్ ఆడాడు. అయితే అతడు కేవలం 16 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.

Next Story