స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగి చనిపోవడం మొత్తం కోలీవుడ్ లో కలకలాన్ని సృష్టిస్తోంది. ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టువం షూటింగ్ లో ఈ ప్రమాదం జరగ్గా, కారు బోల్తా కొట్టే స్టంట్ లో పాల్గొన్న స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా డైరెక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పా. రంజిత్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ కమల్, వెహికల్ ఓనర్ ప్రకాష్, షూట్ మేనేజర్ వినోద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పా.రంజిత్‌తో పాటు స్టంట్ నటుడు వినోద్, నీలం ప్రొడక్షన్స్‌కు చెందిన రాజ్‌కమల్ మరియు వాహన యజమాని ప్రభాకరన్‌పై చట్టపరమైన కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్లు 289, 125, 106(1) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.