అబ్బాయికి 31.. అమెరికా నుంచి పాక్‌కు వెళ్లిన‌ 47 ఏళ్ల మహిళ

ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌కు చెందిన 47 ఏళ్ల అమెరికన్ మహిళ ఇటీవల ఆన్‌లైన్‌లో పరిచయమైన పాకిస్థాన్ వ్యక్తిని వివాహం చేసుకోవాలని సిద్ధమైంది.

By Medi Samrat
Published on : 17 July 2025 9:15 PM IST

అబ్బాయికి 31.. అమెరికా నుంచి పాక్‌కు వెళ్లిన‌ 47 ఏళ్ల మహిళ

ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌కు చెందిన 47 ఏళ్ల అమెరికన్ మహిళ ఇటీవల ఆన్‌లైన్‌లో పరిచయమైన పాకిస్థాన్ వ్యక్తిని వివాహం చేసుకోవాలని సిద్ధమైంది. పాకిస్తాన్‌లోని అప్పర్ దిర్ జిల్లా చేరుకుంది. మిండీ రాస్ముస్సేన్ అనే మహిళ ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో సాజిద్ జెబ్ ఖాన్ (31)ను కలిశారు. సాధారణ చాట్‌లతో ప్రారంభించి, వీడియో కాల్స్‌కు మారారు. చివరికి ప్రేమలో పడ్డారు. సాజిబ్ ఖాన్‌కు ప్రపోజ్ చేసి అతడి కుటుంబ ఆమోదం పొందిన తర్వాత, ఆమె వివాహం చేసుకోవడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది.

రాస్ముస్సేన్ 90 రోజుల విజిట్ వీసాపై పాకిస్తాన్‌కు చేరుకుని ఇస్లాం మతంలోకి మారి జులేఖ అనే పేరును స్వీకరించారు. ఖాన్ ఆమెను ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూలతో సాదరంగా స్వాగతించారు. ఆ తర్వాత ఆ జంట యువకుడి స్వస్థలానికి వెళ్ళింది. స్థానిక ఆచారాలు, ఇస్లామిక్ సంప్రదాయాలను అనుసరించి అప్పర్ దిర్‌లో సాంప్రదాయ నిఖా వేడుకలో ఈ జంట వివాహం చేసుకుంది. స్థానిక పోలీసులు, కుటుంబ వర్గాలు ఈ వివాహాన్ని ధృవీకరించాయి. పాకిస్తాన్‌లో తనకు లభించిన ఆత్మీయ స్వాగతం పట్ల రాస్ముస్సేన్ కృతజ్ఞతను వ్యక్తం చేశారు.

Next Story