ఇండియన్ నేవీ 1110 గ్రూప్ బీ, సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/# విజిట్ చేయండి.