నాలుగో టెస్టు ఆడతాడా.? లేదా.?.. పంత్ ఫిట్‌నెస్‌కు సంబంధించి భారీ అప్‌డేట్ ఇచ్చిన కోచ్‌

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు.

By Medi Samrat
Published on : 18 July 2025 12:01 PM IST

నాలుగో టెస్టు ఆడతాడా.? లేదా.?.. పంత్ ఫిట్‌నెస్‌కు సంబంధించి భారీ అప్‌డేట్ ఇచ్చిన కోచ్‌

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. మాంచెస్టర్‌లో జరగనున్న నాల్గవ టెస్టులో పంత్ బ్యాటింగ్ చేయగలడని, అయితే వికెట్ కీపింగ్‌ అతనికి కష్టమని ర్యాన్ సూచించాడు.

రిషబ్ పంత్ ప్రస్తుతం వేలి గాయం నుండి కోలుకుంటున్నాడు. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు బుమ్రా వేసిన బంతికి క్యాచ్‌ తీసుకునే ప్రయత్నంలో పంత్‌ గాయపడ్డాడు. మూడో టెస్టులో ధృవ్ జురైల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, పంత్ బ్యాటింగ్ చేసి రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 74, 9 పరుగులు చేశాడు.

భారత్‌ సిరీస్‌ను సమం చేయాల్సి ఉంది. దీంతో నాలుగో టెస్టు కీలకంగా మారింది. పంత్ బ్యాటింగ్ చేస్తాడు.. అయితే అతని వేలి గాయం ప‌ట్ల‌ జట్టు మేనేజ్‌మెంట్ జాగ్రత్తతో ఉందని ప్రెస్‌తో మాట్లాడుతున్నప్పుడు ర్యాన్ టెన్ డోస్చాట్ చెప్పాడు.

టెస్టుకు ముందు అతడు మాంచెస్టర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఏది జరిగినా రిషబ్‌ను టెస్టులకు దూరంగా ఉంచాలని నేను అనుకోను. మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేసిన అతడి వేలికి ఇప్పుడు కాస్త‌ ఉపశమనం ల‌భించింద‌న్నాడు.

పంత్ కోలుకోవడానికి చివరి అడ్డంకి వికెట్ కీపింగ్ అని ర్యాన్ టెన్ డోస్చాట్ నొక్కి చెప్పాడు. ఇన్నింగ్స్ మధ్యలో వికెట్ కీపర్‌ను మార్చాల్సిన లార్డ్స్ టెస్టు లాంటి పరిస్థితిని భారత జట్టు స్వీకరించడం లేదు.

వికెట్ కీపింగ్ అనేది అభివృద్ధి ప్రక్రియలో చివరి భాగం. పంత్‌ను జ‌ట్టులో ఉంచుకునేలా చూసుకోవాలి. ఇన్నింగ్స్ మధ్యలో వికెట్ కీపర్‌ను భర్తీ చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్ర‌స్తుతం పంత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. కోలుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. మాంచెస్టర్ టెస్టు నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాను. అతను ఫిట్‌గా ఉంటే తర్వాతి టెస్టు ఆడతాడని పేర్కొన్నాడు.

ప్రస్తుత సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. పంత్ సమయానికి ఫిట్‌గా ఉంటాడని, తద్వారా సిరీస్‌ను సమం చేయడానికి జట్టు ఉత్తమంగా ప్రయత్నించవచ్చని భారత్ భావిస్తోంది. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది.

Next Story