న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
November 17 th Top 10 News.. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగరా మోగింది. గ్రేటర్ పరిధిలోని
By సుభాష్ Published on 17 Nov 2020 6:43 PM IST1. ఒబామా.. రామాయణ, మహాభారతాలు విన్న వేళ
బరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆయనకు భారతదేశంతోనూ, భారతీయులతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ విషయాలను ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న పుస్తకం 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్'లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: జనసేన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. యువ కార్యకర్తల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నగర పరిధిలోని పార్టీ కమిటీ ప్రతినిధులు, కార్యకర్తలు చర్చించుకున్న తర్వాత పోటీ విషయమై తమ వద్ద ప్రస్తావన తెచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరిట మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. తెలంగాణతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఆంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. గజపతుల యుద్ధంలో రఘురామ ఎంట్రీ
అశోక్ గజపతి రాజు, సంచయితల మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. సంచయిత సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో తాజాగా అగ్గి రాజుకుంది. సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్ట్ పై అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. తన తల్లి, రెండో తండ్రితో కలిసి జరుపుకున్న దీపావళి వేడుకకు సంబంధించిన ఫొటోలను సంచయిత షేర్ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఏది ఏమైనా ఈ సారి 'మేసేవారికి' కాక 'మేయరు' అనే వారికే దక్కాలి
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం
నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. వీరు అదృశ్యం కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటగిరి మండలం జీకే పల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నారు. వీరంతా సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టారు. అదృశ్యమైన ఐదుగురిని గుర్తించేందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఢిల్లీ: కరోనా ఎఫెక్ట్.. మార్కెట్లు మూసివేస్తాం.. అనుమతివ్వండి
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనాను అదుపులోకి తీసుకురావాలంటే మార్కెట్లను మూసివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మార్కెట్లు కరోనా హాట్ స్పాట్‌లుగా మారిపోయాయని, కరోనా కేసులను తగ్గించేందుకు కొన్ని రోజుల పాటు మార్కెట్లను మూసివేసేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు అరెస్టు
ఉగ్రవాదులు ఎక్కడో ఓ చోటు కుట్ర చేసేందుకు ప్లాన్ వేస్తున్నా.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేస్తూ వస్తున్నారు. ఇక ఢిల్లీలో అయితే ఏదో ఒక చోట పేలుళ్లు సృష్టించేందుకు ఎన్నో రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నా.. అది సాధ్యం కావడం లేదు. నిఘా వర్గాల సమాచారంతో పట్టుబడుతున్నారు. తాజాగా ఢిల్లీ నగరంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు వేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్ కాలేఖాన్ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్ తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, మరణాలయుధాలు స్వాధీనం చేసుకున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. జీహెచ్ఎంసీ పోరు : మొదలైన ప్రధాన పార్టీల కసరత్తులు
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగరా మోగింది. గ్రేటర్ పరిధిలోని 23 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 150 డివిజన్లకు డిసెంబర్ 1 ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 4 ఫలితాలు వెలువడనున్నాయి. రేపటి నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబర్ 1న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. 'రౌడీబేబీ' సాంగ్ సరికొత్త రికార్డు.. 100 కోట్ల వ్యూస్
తమిళ స్టార్ ధననుష్, మలయాళ బ్యూటీ సాయిపల్లవి జంటగా, బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో 'మారి'కి సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'మారి2'. ఈ సినిమాలో 'రౌడీబేబీ' పాట ఓ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్ సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట ఏకంగా 1 బిలియన్ అక్షరాల 100 కోట్ల వ్యూస్ సాధించి మొట్టమొదటి వీడియో సాంగ్‌గా రికార్డు సృష్టించింది. 2019 జనవరి 2న ఈ రౌడీ బేబీ వీడియో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రోహిత్‌కు జట్టులో స్థానమే కష్టం.. ఇంకా కెప్టెన్సీ కూడానా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసన వెంటనే టీమ్ఇండియా ఆటగాళ్లు గతవారం ఆసీస్ పర్యటకు వెళ్లిన విషయం తెలిసిందే. కరోనా తరువాత టీమ్ఇండియా ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. గత పర్యటలో టెస్టు సిరీస్ గెలిచిన టీమ్ఇండియా.. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని బావిస్తోంది. అయితే.. తొలి టెస్టు అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు వచ్చేస్తుండడం భారత్ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి