గజపతుల యుద్ధంలో రఘురామ ఎంట్రీ
Raghu Ramakrishna Raju Fires On Sanchaita. అశోక్ గజపతి రాజు, సంచయితల మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుండో జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 17 Nov 2020 5:36 PM ISTఅశోక్ గజపతి రాజు, సంచయితల మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. సంచయిత సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో తాజాగా అగ్గి రాజుకుంది. సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్ట్ పై అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. తన తల్లి, రెండో తండ్రితో కలిసి జరుపుకున్న దీపావళి వేడుకకు సంబంధించిన ఫొటోలను సంచయిత షేర్ చేశారు.
Shubh Deepavali from my family to yours 🪔 #Deepavali #शुभदीपावली #HappyDiwali pic.twitter.com/Xi2VO3tq1r
— Sanchaita Gajapati (@sanagajapati) November 14, 2020
ఈ ట్వీట్ పై అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. తండ్రులను మార్చేవారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ తండ్రి ఎవరనేది సోషల్ మీడియాలో మీరే పోస్ట్ చేశారని.. ట్విట్టర్ లో మీరు పెట్టిన పోస్టులే మీ వ్యక్తిత్వాన్ని చెపుతాయని అన్నారు. ఒక్కో చోట ఒక్కో తండ్రి పేరు చెప్పుకునే పిల్లలను తాను ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. ఆమెకు తాత ఎవరో, తండ్రి ఎవరో కూడా తెలియదని.. తండ్రి, తాతను ఆమె జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదని చెప్పారు. తమ వంశీకులు నిర్వహించే ఆలయాలకు ఎప్పుడూ రానివారు, ఇప్పుడు వాటి ఆస్తులపై కన్నేశారని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి అనేది ప్రభుత్వ పదవి కాదని అన్నారు.
ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇచ్చారు. సంచయితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఒక తండ్రి పేరును, ఏపీకి వచ్చినప్పుడు మరొక తండ్రి పేరును సంచయిత చెప్పుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి వచ్చినప్పుడు హిందువుగా ఉంటూ, ఢిల్లీలో క్రిస్టియన్ గా ఉంటున్నారని విమర్శించారు. హిందూ మతాన్ని అవమానపరిచేలా మాట్లాడుతున్నారని చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఆమె అనర్హురాలని వ్యాఖ్యలు చేశారు.