'రౌడీబేబీ' సాంగ్‌ సరికొత్త రికార్డు.. 100 కోట్ల వ్యూస్‌

Rowdy baby song 1 billion views..తమిళ స్టార్‌ ధననుష్‌, మలయాళ బ్యూటీ సాయిపల్లవి జంటగా, బాలాజీ మోహన్‌ డైరెక్షన్‌లో '

By సుభాష్  Published on  17 Nov 2020 7:14 AM GMT
రౌడీబేబీ సాంగ్‌ సరికొత్త రికార్డు.. 100 కోట్ల వ్యూస్‌

తమిళ స్టార్‌ ధననుష్‌, మలయాళ బ్యూటీ సాయిపల్లవి జంటగా, బాలాజీ మోహన్‌ డైరెక్షన్‌లో 'మారి'కి సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'మారి2'. ఈ సినిమాలో 'రౌడీబేబీ' పాట ఓ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్ సౌత్‌ ఇండియాలో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది.

ఈ పాట ఏకంగా 1 బిలియన్‌ అక్షరాల 100 కోట్ల వ్యూస్‌ సాధించి మొట్టమొదటి వీడియో సాంగ్‌గా రికార్డు సృష్టించింది. 2019 జనవరి 2న ఈ రౌడీ బేబీ వీడియో సాంగ్ ను ఫీషియల్‌గా మేకర్‌స్‌ అప్‌లోడ్‌ చేశారు. కేవలం రెండు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్‌ సాధించుకుని ఆ సంఖ్య ఇప్పుడు అంతకంతకు పెంచుకుంటూ ఇప్పుడు ఏకంగా 1 బిలియన్‌కు పైగా వ్యూస్‌, 3.9 మిలియన్లకుపైగా లైక్స్‌ రాబట్టింది.

కాగా, శంకర్‌ రాజా మ్యూజిక్‌, క్యాచీ లిరిక్స్‌తో పాటు ధనుష్‌ వాయిస్‌తో ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా కంపోజ్‌ చేసిన స్టెప్పులు ఈ పాటను ఒక స్థాయికి తీసుకెళ్లాయి. ఇక సాయిపల్లవి స్టెప్స్‌ ఇరగదీసింది. హీరోయిన్‌ కాకముందు పలు డ్యాన్స్‌ షోలలో పాల్గొన్న మలయాళీ ముద్దుగుమ్మ... ఈ సాంగ్‌లో ధనుష్‌తో కలిసి అదరగొట్టేసింది. అలాగే 'కొలవెరి', 'రౌడీబేబీ' పాటలతో సోషల్‌ మీడియాలో రికార్డు సృష్టించాడు ధనుష్.Next Story
Share it