ఒబామా.. రామాయణ, మహాభారతాలు విన్న వేళ
Spent Childhood Listening To Ramayana, Mahabharata. బరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆయనకు భారతదేశంతోనూ, భారతీయుల
By Medi Samrat Published on 17 Nov 2020 6:03 PM IST
బరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆయనకు భారతదేశంతోనూ, భారతీయులతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ విషయాలను ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న పుస్తకం 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్'లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో ఉన్నాయి. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా జీవితాన్ని, అనుభవాలను రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' తాజాగా విడుదల అయ్యింది.
అందులో బరాక్ ఒబామా తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని గుర్తు చేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రపంచ జనాభాలో ఆరవ వంతు, రెండువేల విభిన్న జాతి సమూహాలు, ఏడు వందలకు పైగా భాషలతో మాట్లాడే ప్రజలతో (భారతదేశం) పరిపూర్ణ పరిమాణం కారణంగా భారత్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉందని ఒబామా తన తాజా పుస్తకం ద్వారా తెలిపారు. ఇంకా ఎన్నో విషయాలను ఒబామా తన పుస్తకం ద్వారా స్పష్టం చేశారు. పలువురు ప్రపంచ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఒబామా వెల్లడించారు.