జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: జనసేన

Janasena Party contest GHMC Elction ..గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింద

By సుభాష్  Published on  17 Nov 2020 12:32 PM GMT
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: జనసేన

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. యువ కార్యకర్తల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నగర పరిధిలోని పార్టీ కమిటీ ప్రతినిధులు, కార్యకర్తలు చర్చించుకున్న తర్వాత పోటీ విషయమై తమ వద్ద ప్రస్తావన తెచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేరిట మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. తెలంగాణతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఆంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్దం కావాలని పార్టీ నాయకులు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారు.

జీహెచ్‌ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకే జనసేన అభ్యర్థులను బరిలో నిలుపుతుందని అని జనసేన తెలిపింది. కాగా, దుబ్బక ఉప ఎన్నిక భారీ విజయంతో

కాగా, నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం వెల్లడించారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్‌ 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందని అన్నారు.

Next Story
Share it