న్యూస్‌మీట‌ర్ టాప్ 10 న్యూస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 1:43 PM GMT
న్యూస్‌మీట‌ర్ టాప్ 10 న్యూస్

1. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ముర్ము రాజీనామా!

గిరీశ్‌ చంద్ర ముర్ము జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులై ఏడాది తిరగక ముందే ఆ పదవికి రాజీనామా చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ పరిణామం వెనక చాలా కారణాలు ఉండవచ్చని కొందరి భావన. ఈ విషయంగా ఇండియాటుడే.ఇన్‌లో వార్తాకథనం ప్రచురితమైంది. ఇంత త్వరితంగా జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తెలంగాణ‌లో కొత్త‌గా 2,207 కేసులు.. 12 మ‌ర‌ణాలు

రాష్ట్రంలో కొత్తగా 2,207(గురువారం, 6వ తేధీన‌) కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 75,257కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో 12 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 52,103 మంది వైరస్‌ నుంచి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..!

మెగా అభిమానులు ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పేరుకు సంబంధించిన లోగో కూడా ఎప్పుడూ విడుదల కాలేదు. ఓ సినిమా ఫంక్షన్ లో సినిమా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కరోనా వ్యాక్సిన్ ను ఆ డేట్ కు తీసుకుని వస్తున్నామని చెప్పేసిన ట్రంప్

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ను తీసుకుని రావడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి. భారత్, అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు ఇప్పటికే ఎంతో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్ నుండి మొట్టమొదటి వ్యాక్సిన్ రావచ్చని కూడా ఇటీవలే చెప్పుకొచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏకంగా వ్యాక్సిన్ రిలీజ్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 62,538 పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,538 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 886 మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కరోనా కేసులు ఇవే. వీటితో కలిపి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ ఎవరు? బరిలోకి ఆ ముగ్గురు

క్రికెట్ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఐపీఎల్ టోర్నీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు వరుసగా వెల్లడవుతున్నాయి. ఈసారి టోర్నీని దుబాయ్ లో నిర్వహిస్తుండటమే కాదు.. అందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టైటిట్ స్పాన్సర్ ఎవరన్నది మరో ఆసక్తికర అంశంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. 21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరం : ప్రధాని మోదీ

21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరమని.. అందుకే జాతీయ విద్యావిధానంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ నూతన విద్యావిధానంలో సంస్కరణలపై నిర్వహించిన సదస్సులో మోదీ పాల్గొని మాట్లాడారు. ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలన్నారు. నూతన విద్యా విధానం సవాలుతో కూడుకున్నదని తెలిపారు. అనేక మందితో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ముందు హాజరైన రియా చక్రవర్తి

నటి రియా చక్రవర్తి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు ముంబైలో హాజరైంది. సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ జరిగే వరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్ ప్రక్రియను వాయిదా వేయాలని రియా చక్రవర్తి చేసిన అభ్యర్థనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒప్పుకోకపోవడంతో ఆమె ఈరోజు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. Fact Check : నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లోపల అంత విలాసవంతంగా ఉంటుందా..?

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీతూ పత్వానీ ఓ విలాసవంతమైన విమానానికి సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన విమానం అంటూ పోస్టు చేశారు. ఆయన చేసిన ట్వీట్ లో సెటైరికల్ గా నరేంద్ర మోదీ మీద విమర్శలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విష‌య‌మై మరో అడుగుపడింది. రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త‌ జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Next Story
Share it