ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 2:30 AM GMT
ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..!

మెగా అభిమానులు ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పేరుకు సంబంధించిన లోగో కూడా ఎప్పుడూ విడుదల కాలేదు. ఓ సినిమా ఫంక్షన్ లో సినిమా పేరు ఆచార్య అని మెగాస్టార్ చిరంజీవి నోరుజారారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఇంకొద్ది రోజులు మాత్రమే వెయిటింగ్ అని మెగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. చిరంజీవి పుట్టినరోజు 'ఆగష్టు 22'న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలవ్వచ్చు.

ఈ సినిమా కోసం మెగా స్టార్ చిరంజీవి లుక్ కూడా చాలా వరకూ మార్చినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్ మాత్రమే వదులుతారా లేక టీజర్ ను కూడా రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ సామాజిక మాధ్యమాల్లో ఫుల్ డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కొరటాల శివ ఇంతకు ముందు సినిమాల లాగే ఈ సినిమాలో కూడా మెసేజ్ ఉంటుందని, సోషల్ డ్రామా ఉంటుందని బలంగా నమ్మారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మొదట వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో నిజం లేదని చిరంజీవి కొట్టి పడేశారు. కొరటాల శివ మాత్రం ఈ సినిమాలో ఓ కీలకపాత్రను రామ్ చరణ్ తేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారని.. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను బట్టి రామ్ చరణ్ పాత్ర ఆచార్యలో ఉంటుందో లేదో చెప్పగలమని అన్నారు చిరంజీవి. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కాగా చేస్తాడని మెగా అభిమానులు బలంగా నమ్ముతున్నారనుకోండి.

ఈ సినిమా నుండి త్రిష అనూహ్యంగా తప్పుకోవడంతో కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. ఖైదీ నెంబర్ 150 తర్వాత కాజల్ మెగాస్టార్ తో మరోసారి జతకట్టింది. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా కూడా స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరవనుంది. వీరిద్దరి మధ్య వచ్చే సాంగ్ ను ఇప్పటికే షూట్ చేసేశారు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం చిత్ర యూనిట్ బ్రేక్ తీసుకుంది. త్వరలోనే షూటింగ్ కు వెళ్లే అవకాశం కనిపించనుంది.

Next Story