హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు గురువారం మెగాస్టార్‌ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వీర్రాజుకు చిరంజీవి అభినందలు తెలిపారు. ఆయనన్ను పుష్పమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. జనసేన అధ్యక్షుడు, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ పొత్తులతో ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని చిరంజీవి ఆకాంక్షించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.