మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు
By తోట వంశీ కుమార్ Published on : 6 Aug 2020 6:38 PM IST

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు గురువారం మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వీర్రాజుకు చిరంజీవి అభినందలు తెలిపారు. ఆయనన్ను పుష్పమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. జనసేన అధ్యక్షుడు, తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ పొత్తులతో ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని చిరంజీవి ఆకాంక్షించారు.
Next Story