కరోనా వ్యాక్సిన్ ను ఆ డేట్ కు తీసుకుని వస్తున్నామని చెప్పేసిన ట్రంప్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 5:46 AM GMT
కరోనా వ్యాక్సిన్ ను ఆ డేట్ కు తీసుకుని వస్తున్నామని చెప్పేసిన ట్రంప్

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ను తీసుకుని రావడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి. భారత్, అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు ఇప్పటికే ఎంతో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్ నుండి మొట్టమొదటి వ్యాక్సిన్ రావచ్చని కూడా ఇటీవలే చెప్పుకొచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏకంగా వ్యాక్సిన్ రిలీజ్ అయ్యే డేట్ ను ప్రకటించేశారు.

అమెరికా చేతిలో నవంబర్ 3 నాటికి వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ట్రంప్ కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని తేల్చేశారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు. అమెరికా వద్ద ఉన్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్నిదొంగిలించడం చైనాకు సాధ్యమయ్యేపనేనని వ్యాఖ్యలు కూడా చేశారు.

ఏ కంపెనీ కూడా వ్యాక్సిన్ రిలీజ్ డేట్ ను చెప్పలేదు.. కానీ ట్రంప్ మాత్రం వ్యాక్సిన్ రిలీజ్ డేట్ నవంబర్ 3 అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు నవంబర్ 3నే జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో తనకు ప్లస్ గా మారాలనే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థులు విమర్శణాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు.

Next Story