న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By Medi Samrat Published on 14 July 2020 3:04 PM GMT
1. బ్లాక్ మార్కెట్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ : 8 మంది అరెస్ట్
హైద్రాబాద్ నగరంలో కొవిడ్ యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు పాతబస్తీలో అంతరాష్ట్ర బ్లాక్ మార్కెట్ ముఠాను అరెస్ట్ చేశారని తెలిపారు. కరోనా వైరస్ బారిన పడిన వారికి.. పూర్తి వార్త కొరకు క్లిక్ చేయండి
2. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన డిప్యూటీ స్పీకర్
ఇటీవల కరోనా మహమ్మారి నుండి కోలుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. పద్మారావు గౌడ్ మాత్రం బోనాల ఉత్సవాల్లో భౌతిక దూరం పాటించకుండా.. మాస్క్ ధరించకుండా ఉత్సవాల్లో పాల్గొని మరోమారు హాట్ టాఫిక్.. పూర్తి వార్త కొరకు క్లిక్ చేయండి
3. రాజధానిలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. వివరాలు ఇవే.!
2020 సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు మాసాల్లో రోడ్డు ప్రమాదాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రివ్యూ నిర్వహించారు. కాగా.. గడిచిన ఆరు మాసాల్లో హైదరాబాదులో 23 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. గత సంవత్సరంతో పోల్చితే.. పాదచారుల రోడ్డు ప్రమాదాలు 38% తగ్గగా.. సాధారణ ట్రాఫిక్ వాయిలేషన్ కేసులు పెరిగాయి. 2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 137 రోడ్డుప్రమాదాలు చోటుచేసుకోగా.. పూర్తి వార్త కొరకు క్లిక్ చేయండి
4. సుశాంత్ సింగ్ గురించి ఎమోషనల్ పోస్టు పెట్టిన రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఎక్కువ మంది సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించే మాట్లాడుతున్నారు. సుశాంత్-రియా మధ్య ఉన్న అనుబంధం గురించి బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చింది. ఆమె ఇన్ని రోజులూ సుశాంత్ గురించి ఎటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. తాజాగా సుశాంత్ మరణంపై ఆమె ఒక ఎమోషనల్ పోస్టు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రిషబ్ పంత్ ఆటలో ఆ మార్పుకు కారణమేమిటో చెప్పిన కైఫ్
మహేంద్రసింగ్ ధోని వారసుడిగా కీర్తి గడించాడు రిషబ్‌పంత్. ధోని లేని లోటును పూరించడమంటే మాటలు కాదు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ఆట తీరుతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మైదానంలో అతడి మెరుపులు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఎంతో ప్లస్ అయ్యాయి. ఇక భారత జట్టులో చోటు సంపాదించాక అతడి ఆట తీరులో నిలకడ లోపించింది.. ధోని స్థానంలో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Fact Check : చైనీయుడు వెన్నుపోటు పొడుస్తున్న శిల్పం శ్రీరంగం గుడిలో 700 ఏళ్ల క్రితమే చెక్కారా..?
భారత్-చైనా దేశాల సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. భారత్ కు చెందిన 20 మంది సైనికులు మరణించారు. చైనా సైనికుల మరణంపై ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా ఇవ్వలేదు. చైనా మీద భారత్ అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తీసుకుని వస్తోంది. భారత అంతర్గత రక్షణ కోసం చైనాకు చెందిన 59 యాప్స్ ను కూడా భారత్ లో బ్యాన్ చేసింది. హై లెవెల్ మీటింగ్ ను.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఏపీలో మరణమృదంగం.. 24గంటల్లో 43 మంది మృతి.. 1916 కేసులు నమోదు
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం వందల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,670 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1916 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1908 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ప్రాణంగా ప్రేమించుకున్నారు.. భార్య మరణాన్నితట్టుకోలేక..
వాళ్లిద్దరు ఇరుగుపొరుగున ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి ప్రేమ చిగురించింది. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతి రూపంగా ఓ బిడ్డ కూడా జన్మించాడు. అయితే.. పండంటి బిడ్డకు జన్మించిన రెండు రోజుల్లోనే భార్య మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన.. ఆ భర్త కూడా ఈ లోకం విడిచి పోయాడు. ఈ హృదయ విదారకర ఘటన విశాఖ సింహాచలం కొండపైన.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సచిన్ పైలట్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
రాజస్తాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేడు మరో మలుపు తిరిగింది. సీఎల్పీ భేటీకి రెండోసారి డుమ్మా కొట్టిన తిరుగుబాటు నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ అధిస్టానం వేటు వేసింది. సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ ఛీప్ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. కాంగ్రెస్‌ను వీడుతున్న ఆశా కిరణాలు
ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో నాయకత్వ లేమితోపాటు…సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయ లోపాలు పలుమార్లు తేటతెల్లమయ్యాయి. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వ్యవహారంతో ఈ విభేదాలు బయటి ప్రపంచానికి బహిర్గతమయ్యాయి. అదే తరహాలో తాజాగా రాజస్థాన్ లోనూ సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు, సచిన్ పైలట్ కు ఉన్న విభేదాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి