సుశాంత్ సింగ్ గురించి ఎమోషనల్ పోస్టు పెట్టిన రియా చక్రవర్తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 10:40 AM GMT
సుశాంత్ సింగ్ గురించి ఎమోషనల్ పోస్టు పెట్టిన రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఎక్కువ మంది సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించే మాట్లాడుతున్నారు. సుశాంత్-రియా మధ్య ఉన్న అనుబంధం గురించి బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చింది. ఆమె ఇన్ని రోజులూ సుశాంత్ గురించి ఎటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. తాజాగా సుశాంత్ మరణంపై ఆమె ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది.

“Still struggling to face my emotions.. an irreparable numbness in my heart . You are the one who made me believe in love, the power of it . You taught me how a simple mathematical equation can decipher the meaning of life and I promise you that I learnt from you every day. I will never come to terms with you not being here anymore. I know you’re in a much more peaceful place now. The moon, the stars, the galaxies would’ve welcomed “the greatest physicist “with open arms . Full of empathy and joy, you could lighten up a shooting star - now, you are one . I will wait for you my shooting star and make a wish to bring you back to me.”

నా భావోద్వేగాలను ఎదుర్కోడానికి ఇంకా కష్టపడుతున్నాను. నా మనసులో ఏదో అలజడి. నాకు ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించావు. ప్రేమకున్న శక్తిని తెలిసేలా చేశావని తన పోస్టులో చెప్పుకొచ్చింది రియా. జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించావు.. దాన్నినేను ప్రతి రోజు నేర్చుకుంటానని నీకు మాట ఇస్తున్నాను.. నువ్వు శాశ్వతంగా వెళ్లిపోయావనే విషయాన్ని నేనింకా నమ్మలేకపోతున్నానని ఆమె తన మనసులోని బాధను వ్యక్త పరిచింది. ప్రశాంతమైన ప్రదేశంలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు.. నీలాంటి గొప్ప శాస్త్రవేత్తకు చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు స్వాగతం పలికాయని నమ్ముతున్నాను.. నీ మంచితనం, ఆనందంతో ప్రతి దాన్ని అద్భుతంగా మార్చగలవు. నీకోసం ఎంతో ఎదురు చూస్తుంటాను. నిన్ను మళ్లీ తిరిగి నా దగ్గరకు తీసుకు రావాలని కోరుకుంటున్నాను.. అని ఆమె సుశాంత్ తో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది.

చివరిగా 'నువ్వు ప్రశాంతంగా ఉండాలి సుశి.. నిన్ను కోల్పోయి 30 రోజులు అయ్యింది.. కానీ జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.. నీతో ఎప్పటికీ నా అనుబంధం

అలాగే ఉంటుంది' అని రాసుకుని వచ్చింది రియా.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు రియా అండగా నిలిచారు. భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ లు హార్ట్ ఈమోజీలతో రియాకు మద్దతు తెలిపారు.

జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన బాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రియా చక్రవర్తి సుశాంత్ అంతిమ సంస్కారాలకు హాజరయ్యింది. బాంద్రా పోలీసులు రియా చక్రవర్తి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు.

Next Story