న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
November 15th Top 10 News .. దక్షిణాదిలో అగ్ర కథానాయిక వెలుగొందుతోంది నయనతార. ఆమె ప్రధాన
By సుభాష్ Published on 15 Nov 2020 11:45 AM GMT1చిరంజీవి క్వారంటైన్‌లో ఉండాల్సిందే : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకిందనే వార్త ఇటీవలే కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే రెండురోజుల తరువాత అది టెస్ట్ లలో సమస్య వలన వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ అనీ, మళ్ళీ చేసిన టెస్ట్ లలో నెగెటివ్ వచ్చిందనీ తేలింది. స్వయంగా ఈ విషయాల్ని చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా ట్వీట్లు చేశారు. అయితే, చిరంజీవికి పాజిటివ్, నెగిటివ్ అన్న విషయాలపై వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగిటివ్ అని వచ్చినప్పటికీ చిరంజీవి క్వారంటైన్‌లో ఉండాల్సిందే అన్నారు శ్రీనివాసరావు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2.కాజల్ అగర్వాల్ హనీమూన్ ఖర్చు ఎంతో తెలుసా..? తెలిస్తే షాకవుతారు..!
కాజల్ అగర్వాల్.. అక్టోబర్ 30న నచ్చిన ప్రియుడు గౌతమ్ కిచ్లుమ్‌తోనే వివాహమైన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు పూజలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత నాలుగు రోజుల కిందట గౌతమ్‌తో కలిసి మాల్దివ్‌లకు హనీమూన్ వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తోంది. అయితే కాజల్ హనీమూన్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకో రకమైన ఫోటో పోస్టు చేస్తూ అందరిని ఆకర్షిస్తోంది ఈ చందమామ. ముఖ్యంగా రోజు బీచ్ దగ్గర భర్తతో ఉన్న ఫోటోలు విడుదల చేసింది. ఆ తర్వాత రోజు ఏకంగా అండర్‌వాటర్లో ఉన్న ఫోటోలు విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. నేను చాలా పిరికివాడిని: రాంగోపాల్ వర్మ
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ పేరు తెలియనివారుండరు. ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఉండటమే ఈయనకు అలవాటు. ఎవరో ఒకరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విషయంపై వ్యంగ్యంగా స్పందించడం వర్మకు ఉన్న అలవాటు. చివరికి తనపై కూడా పంచులు వేసుకుంటాడు. ఇక తాజాగా దీపావళి పండగను వర్మ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకొన్నారు. తల్లి, సోదరితో కలిసి తన ఇంటి ముందు టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ సోదరి చిచ్చుబుడ్డి పేలుస్తుండగా, భయంతో వర్మ ఆయన తల్లి వెనుక దాక్కున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. వార ఫలాలు : 15 నవంబర్ నుంచి 21 నవంబర్ వరకు
మేష రాశి :- ఈ రాశి వారికి విశేష ధన లాభం ఉంది. దాని వల్ల ఆనందాన్ని అనుభూతిని పొంది సుఖ జీవనానికి ప్రయత్నం చేస్తారు. చంద్రుడు విశేష ధనాన్ని సౌఖ్యం ఇస్తాడు. కుజ శుక్ర శనులు వీరు ఆలోచనలకు మాత్రం పూర్తిగా దూరంగా పని చేసి మీరు అనుకున్న పని వెనక పెడుతూనే ఉంటారు. అయితేబుధ గురుల ప్రభావం అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ముందువెనుకలు ఆలోచించకుండా చేసిన పనులలో అవకాశం చేజారి పోతుంది. మీ నోటికి మంచి జరిగే ఫలితం కంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ప్రముఖ నటుడు కన్నుమూత
బెంగాల్ ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడచారు. ఛటర్జీ అక్టోబర్ 6న కరోనా బారిన పడడగా, కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత కరోనా నెగిటివ్ తేలడంతో డిశ్చార్జీ అయి తన నివాసానికి వెళ్లారు. మరోసారి ఆరోగ్యం క్షీణించంతో అక్టోబర్ 14న మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఛటర్జీని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. 'అమ్మోరు తల్లి' రివ్యూ
దక్షిణాదిలో అగ్ర కథానాయిక వెలుగొందుతోంది నయనతార. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మూకుత్తి అమ్మన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో అనువదించారు. నయన తార దేవత పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అలానే ట్రైలర్ విడుదలైన తర్వాత చెలరేగిన వివాదం కూడా ఈ సినిమాని వార్తల్లో నిలిపింది. వివాదాల మధ్య దీపావళి కానుకగా నవంబర్ 14న 'అమ్మారు తల్లి' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయింది. అమ్మోరు తల్లి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు..ఈ రోజు ఎన్ని కేసులంటే
తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 21,264 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 661 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,57,374 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకకు 1,404 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజు కోవిడ్ నుంచి 1,637 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. బిగ్‌బాస్-4 నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..!
తెలుగు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో ఎంతో పాపులారిటీ పొందింది. విమర్శలు, గొడవలు, ఏడుపులు జరిగే ఈ షోలో ప్రతీవారం నామినేషన్స్ జరగడం కామన్. వారాంతంలో ఒకరు బయటకు వెళ్లడం నిరంతరం జరిగే పని. అయితే ఎవరు బయటకు వెళ్తారు అనే విషయమై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అయితే ఒక రోజు ముందుగానే ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి ఎవరరు హౌస్ నుంచి వెళ్లిపోతున్నారనే విషయం లీకుల ద్వారా తెలిసిపోతుంది. ఈ వారం నామినేషన్స్‌లో అభిజిత్, అరియానా, హారిక, మోనాల్, సోహైల్, మెహబూబ్ ఉన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కొత్త వ్యాపారంలోకి ఎంఎస్ ధోనీ.. అది చాలా లాభసాటి గురూ..!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త వ్యాపారాన్నిమొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు 'కడక్‌నాథ్' పెంపకంపై దృష్టి సారించినట్లు సమాచారం. రాంచీలోని ధోనీ ఫాంహౌజ్ లో ఈ ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పనున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ధోనీ ముందుగానే 2 వేల కోడి పిల్లలు ఆర్డర్ చేసినట్లు .. అవి కూడా డిసెంబరు 15వ తేదీ నాటికి డెలివరీ కానున్నయట. ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మెండాతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారట.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు
ఆర్టీసీ కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని.. ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి తక్షణమే రూ.120 కోట్లు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను సీఎం ఆదేశించారు. హైద్రాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. ఆర్జీసి కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి