బిగ్‌బాస్‌-4 నుంచి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతనే..!

Bbiggboss 4 telugu elimination.. తెలుగు ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ షో ఎంతో పాపులారిగి పొందింది. విమర్శలు, గొడవలు

By సుభాష్  Published on  15 Nov 2020 4:31 AM GMT
బిగ్‌బాస్‌-4 నుంచి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతనే..!

తెలుగు ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ షో ఎంతో పాపులారిటీ పొందింది. విమర్శలు, గొడవలు, ఏడుపులు జరిగే ఈ షోలో ప్రతీవారం నామినేషన్స్‌ జరగడం కామన్‌. వారాంతంలో ఒకరు బయటకు వెళ్లడం నిరంతరం జరిగే పని. అయితే ఎవరు బయటకు వెళ్తారు అనే విషయమై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అయితే ఒక రోజు ముందుగానే ఎపిసోడ్‌ అయిపోతుంది కాబట్టి ఎవరరు హౌస్‌ నుంచి వెళ్లిపోతున్నారనే విషయం లీకుల ద్వారా తెలిసిపోతుంది. ఈ వారం నామినేషన్స్‌లో అభిజిత్‌, అరియానా, హారిక, మోనాల్‌, సోహైల్‌, మెహబూబ్‌ ఉన్నారు. ఇక అంచనాలకు తగ్గట్లుగానే మెహబూబ్‌ను ఇంటి నుంచి పంపించినట్లు సమాచారం. చాలా వారాల నుంచి మెహబూబ్‌ను ఇంటికి పంపించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అతన్ని ఇంటికి పంపించారని తెలుస్తోంది.

ఇక ఎలిమినేషన్‌ ప్రక్రియ విషయమై అనుమానాలు అలానే ఉండిపోతున్నాయి. ఓట్లు వేస్తున్నా.. కొందరు ఎందురు ఎందుకు ఎలిమినేట్‌ అవుతున్నారో తెలియడం లేదని, ఇదంతా బిగ్‌బాస్‌ చేస్తున్న పని అని పలువురు వీక్షకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వారి ఎలిమినేషన్స్‌ తర్వాత షో రేటింగ్‌ సైతం తగ్గిపోయింది. దీంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. యాంకర్‌ సుమతో కాస్త ఎంటర్టైన్‌మెంట్‌ పంచి రేటింగ్‌ పెంచేలా ప్లాన్‌ చేశారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఏదీ ఏమైనా ముందుగా అనుకున్నట్లుగానే మెహబూబ్‌ హౌస్‌ నుంచి ఔట్‌ అయినట్లు తెలుస్తోంది. మరి పూర్తిగా క్లారిటీ రావాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.

Next Story