కాజల్ అగర్వాల్ హనీమూన్ ఖర్చు ఎంతో తెలుసా..? తెలిస్తే షాకవుతారు..!
Kajal agarwal, Gautam kitchlu Honeymoon Tour..కాజల్ అగర్వాల్.. అక్టోబర్ 30న నచ్చిన ప్రియుడు గౌతమ్
By సుభాష్ Published on 15 Nov 2020 4:39 PM ISTకాజల్ అగర్వాల్.. అక్టోబర్ 30న నచ్చిన ప్రియుడు గౌతమ్ కిచ్లుమ్‌తోనే వివాహమైన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు పూజలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత నాలుగు రోజుల కిందట గౌతమ్‌తో కలిసి మాల్దివ్‌లకు హనీమూన్ వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తోంది. అయితే కాజల్ హనీమూన్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకో రకమైన ఫోటో పోస్టు చేస్తూ అందరిని ఆకర్షిస్తోంది ఈ చందమామ. ముఖ్యంగా రోజు బీచ్ దగ్గర భర్తతో ఉన్న ఫోటోలు విడుదల చేసింది. ఆ తర్వాత రోజు ఏకంగా అండర్‌వాటర్లో ఉన్న ఫోటోలు విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఏకంగా అక్కడ ఓ బెడ్ వేసుకుని ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసిన ఈ ముద్దుగుమ్మ కాజల్ ప్లాన్ మమూలుగా చేయలేదు హనీమూన్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్లు. మీ హనీమూన్ చేపలు రెండు కళ్లు తెరుచుకుని మరీ చూస్తున్నాయి కాజల్ అంటూ సరదా కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాజల్ జంట మాల్దివ్స్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌ను వారం రోజులకు అద్దెకు తీసుకున్నారు. అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే షాకవుతారు. వారు చేస్తున్న ఎంజాయ్ లెక్కలు కూడా బయటకు పొక్కాయి.
హనీమూన్ కోసం కాజల్ జంట ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాల రూ.40 లక్షలు. అవును ఇది నిజమేననీ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మాల్దీవ్స్ అంటే భూతల స్వర్గం. అక్కడ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు అలలు. వాటితో పోటీపడే అందాల భామల సో యగాలు, ఇసుక తిన్నెలు, వెన్నెల రాత్రులు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వాటి మధ్య తమ హనీమూన్ గడపాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఇప్పుడు కాజల్ కూడా అదే చేసింది.