చిరంజీవి క్వారంటైన్‌లో ఉండాల్సిందే : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్

Telangana Health Director about Chiranjeevi. మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింద‌నే వార్త‌ ఇటీవలే కలకలం రేపిన విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  15 Nov 2020 9:37 AM GMT
చిరంజీవి క్వారంటైన్‌లో ఉండాల్సిందే : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింద‌నే వార్త‌ ఇటీవలే కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే రెండురోజుల తరువాత అది టెస్ట్ లలో సమస్య వలన వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ అనీ, మళ్ళీ చేసిన టెస్ట్ లలో నెగెటివ్ వచ్చిందనీ తేలింది. స్వయంగా ఈ విషయాల్ని చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా ట్వీట్లు చేశారు.

అయితే, చిరంజీవికి పాజిటివ్, నెగిటివ్ అన్న విషయాలపై వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగిటివ్ అని వచ్చినప్పటికీ చిరంజీవి క్వారంటైన్‌లో ఉండాల్సిందే అన్నారు శ్రీనివాసరావు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నారు. ఒకసారి కరోనా పాజిటివ్‌గా తేలి, ఆపై నెగటివ్ వచ్చినా, ఐసీఎంఆర్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం.. క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో రాదని స్పష్టం చేశారు. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్ గానే భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. ఆ తరువాత నెగటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా, క్వారంటైన్‌లో ఉండి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.


Next Story
Share it