తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు..ఈ రోజు ఎన్ని కేసులంటే
Decreased corona cases in Telangana .. తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన
By సుభాష్ Published on
15 Nov 2020 5:03 AM GMT

తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 21,264 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 661 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,57,374 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకకు 1,404 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజు కోవిడ్ నుంచి 1,637 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,40,545కు చేరింది. రాష్ట్రంలో 15,425 కేసులు యాక్టివ్‌లో ఉండగా, హోం ఐసోలేషన్‌లో 12,888 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు.. జీహెచ్‌ఎంసీలో 167 నమోదయ్యాయి. ఇక ఇతర జిల్లాల్లో పదలు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story