నేను చాలా పిరికివాడిని: రాంగోపాల్‌ వర్మ

Ram gopal varma twitt.. వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఈ పేరు తెలియనివారుండరు.

By సుభాష్  Published on  15 Nov 2020 8:32 AM GMT
నేను చాలా పిరికివాడిని: రాంగోపాల్‌ వర్మ

వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఈ పేరు తెలియనివారుండరు. ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఉండటమే ఈయనకు అలవాటు. ఎవరో ఒకరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విషయంపై వ్యంగ్యంగా స్పందించడం వర్మకు ఉన్న అలవాటు. చివరికి తనపై కూడా పంచులు వేసుకుంటాడు. ఇక తాజాగా దీపావళి పండగను వర్మ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకొన్నారు. తల్లి, సోదరితో కలిసి తన ఇంటి ముందు టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌ వర్మ సోదరి చిచ్చుబుడ్డి పేలుస్తుండగా, భయంతో వర్మ ఆయన తల్లి వెనుక దాక్కున్నాడు. ఈ వీడియోను వర్మ ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతేకాకుండా నేను సాధారణంగా చాలా పిరికివాడిని. అందుకే తల్లి వెనుకన దాక్కున్నాను .. అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టాడు.

అలాగే వర్మ కూడా స్వయంగా చిచ్చుబుడ్డిలు కాల్చాడు. ఆ వీడియోని పోస్టు చేస్తూ దీపావళి సందర్భంగా వాయు, శబ్ద కాలుష్యానికి నా వంతు సహకారం అందిస్తున్నానని వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు వర్మ. ఇక మరో ట్వీట్‌లో దీపావళి సందర్భంగా వోడ్కా రుచి చూడమని నా తల్లి, సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా అంటూ వోడ్కా గ్లాస్‌ తన తల్లి ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటోను సైతం పోస్టు చేస్తూ ట్వీట్‌ చేశారు.


Next Story
Share it