ప్రముఖ నటుడు కన్నుమూత

Bengali actor Soumitra Chatterjee dies I ప్రముఖ నటుడు కన్నుమూత

By సుభాష్  Published on  15 Nov 2020 8:07 AM GMT
ప్రముఖ నటుడు కన్నుమూత

బెంగాల్‌ ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడచారు. ఛటర్జీ అక్టోబర్‌ 6న కరోనా బారిన పడడగా, కోల్‌ కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత కరోనా నెగిటివ్‌ తేలడంతో డిశ్చార్జీ అయి తన నివాసానికి వెళ్లారు. మరోసారి ఆరోగ్యం క్షీణించంతో అక్టోబర్‌ 14న మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఛటర్జీని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

కాగా, సౌమిత్ర ఛటర్జీ బెంగాల్ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడు. సత్యజిత్‌రాయ్‌ మూవీ అపుర్‌ సంసారర్‌తో సౌమిత్ర తన కెరియర్‌ ప్రారంభించారు. ఉత్తమ నటుడిగా ఒక జాతీయ పురస్కారంతో పాటు మరో వైపు ప్రత్యేక జ్యూరీ విభాగంలో మరో రెండు జాతీయ అవార్డులతో కలిపి మొత్తం మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ చిత్ర పరిశ్రరమకు ఆయన చేసిన సేవలకు గానూ కేంద్రం 2004 పద్మభూషణ్‌తో సత్కరించింది. 2012లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

Next Story