వార ఫలాలు : 15 నవంబర్ నుంచి 21 నవంబర్ వరకు

November 15th To 21st Rasipalalu. ఈ రాశి వారికి విశేష ధన లాభం ఉంది. దాని వల్ల ఆనందాన్ని అనుభూతిని పొంది సుఖ జీవనానికి

By Medi Samrat  Published on  15 Nov 2020 8:22 AM GMT
వార ఫలాలు : 15 నవంబర్ నుంచి 21 నవంబర్ వరకు

మేష రాశి :- ఈ రాశి వారికి విశేష ధన లాభం ఉంది. దాని వల్ల ఆనందాన్ని అనుభూతిని పొంది సుఖ జీవనానికి ప్రయత్నం చేస్తారు. చంద్రుడు విశేష ధనాన్ని సౌఖ్యం ఇస్తాడు. కుజ శుక్ర శనులు వీరు ఆలోచనలకు మాత్రం పూర్తిగా దూరంగా పని చేసి మీరు అనుకున్న పని వెనక పెడుతూనే ఉంటారు. అయితేబుధ గురుల ప్రభావం అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ముందువెనుకలు ఆలోచించకుండా చేసిన పనులలో అవకాశం చేజారి పోతుంది. మీ నోటికి మంచి జరిగే ఫలితం కంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేయటం, మాట్లాడటం కూడా చాలా అవసరం. ఇది మీకు అలవాటు లేని పని. అయినప్పటికీ కూడా తప్పదు. మీరు ఎన్ని అనుకున్నా ఊహించుకున్న ఈ వారం మీరు బాగా ఇబ్బంది పడక తప్పదు. అపజయం ముందు నడుస్తూ ఉంటుందా అన్న స్థితికి వచ్చేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా పెద్ద అనుకూలత లేదు. గత నాలుగైదు వారాల కంటే ఈ వారం చాలా దారుణంగా ఉంటుంది. మీకు ఈ వారంలో 32 శాతం మాత్రమే శుభ ఫలితాలున్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. భరణి నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. కృత్తిక 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం :- ప్రతిరోజు శివుని అభిషేకం శివధ్యానం శివ స్తోత్రం ఎక్కువగా చేయండి. కార్తీక దీపారాధన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృషభ రాశి :- ఈ రాశి వారికి బంధుదర్శనం అలంకార ప్రాప్తి మున్నగునవి చాలా ఆనందదాయకమైన జీవితం వైపు తీసుకుపోతాయి. ఇంతకుముందు మీదట వీరికి ఫలితాలు తగ్గాయి. అయినా కొంత వరకు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మీ మీద ద్వేషం పెంచుకున్న వారు పెరిగారు కాబట్టి అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఉన్నట్లయితే మీరు ఎక్కువగా మంచిని పొందే అవకాశం ఉంది. అంతే కాదు మీకు అనుకోకుండా విద్య,వివాహము ఇలాంటి ప్రయోజనాలు కూడా జరగ బోతున్నాయి. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోగలిగి నట్లయితే వివాహ అవకాశాలు కూడా కలిసొస్తాయి. చాలా శుభపరిణామాలు కి ఇది దోహద పడే అవకాశం ఉంది. మంచి కార్యక్రమానికి గాను మీ ధనము వినియోగమవుతుంది. సప్తమంలో రవి ప్రభావము మీకు ఎక్కువగా ఉంది అందుచేత మహిళల కుటుంబంలో సభ్యులు పిల్లలు పెద్దల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మీకు ఈ వారంలో 40 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. మృగశిర 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- సూర్యనమస్కారాలు, సూర్యోదయ సమయానికి సూర్య దర్శనం చేయండి.గురు చరిత్ర పారాయణం దక్షిణామూర్తి స్తోత్రం మంచి ఫలితాన్నిస్తుంది

మిధున రాశి : ఈ రాశి వారికి ధనలాభం కుటుంబసౌఖ్యం సుఖసంతోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు విశేషమైన ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా ఎన్నాళ్లు శత్రువులు గా పనిచేసిన వారు మిత్రులుగా మారిపోతారు అయితే ధనానికి ఇబ్బంది పడిపోతారు. అయితే శుక్ర గ్రహము ప్రభావము, కేతువు యొక్క ప్రభావము మీ పైన చాలా బాగా పనిచేస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మీ జీవితాన్ని మీరే సరిచేసి ఉంటారు మీరు సంతోషాన్ని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో కూడా మీ ఆరోగ్య వ్యవహారాల మీద మీ అభిప్రాయం మీద మంచి భావన కలిగినటువంటి వాళ్ళు పెరుగుతారు మీ సలహాలు వల్ల మంచి పనులు జరుగుతాయి.ఎన్నాళ్ళో పరిష్కారం కాని చాలా పనులు ఈ వారంలో నెరవేరే అవకాశం కూడా ఉంది. ఒక్కొక్క సమయంలో మీకు మీరే భయపడి కార్యాన్ని వెనకాలవేసుకుంటారు మీరు బయటకు వచ్చినట్లు అయితే మీకు ఒక స్త్రీ యొక్క సహకారంతో మీకు పని కూడా నిలబడే అవకాశం ఉంది ఇవాళ మీరు ఎక్కువ మంది బంధువులు కలిసి ఉంటారు మీరు ఈ వారంలో 56 శాతం ఫలితాలు ఉన్నాయి ఇటువంటి అవకాశం దొరకదు కాబట్టి సద్వినియోగం చేసుకోండి. మృగశిర 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలుగుతారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది పునర్వసు 1 2 3 పాదాలు వారికి మాత్రం జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం :- నవగ్రహ హోమం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారం నియమాలు పాటిస్తూ నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారంనాడు ఉదయమే ఆవుకు తినిపించండి.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి శుభ పరిణామాలు పెరుగుతున్నాయి. విశేష ధనం ఎంత వస్తుందో అలాగే అందుకు తగ్గ ఖర్చు కూడా ఉంటుంది. మీరు ఎంత కృషి చేస్తారు అంతా తగ్గ ఫలితం రావట్లేదు అని విలపిస్తూ ఉంటారు కానీ అవసరం లేదు మీకు మంచి రోజులు వస్తున్నాయి. ఇంకా ఇంకా ముందుకు మీరు వెళ్ళ గలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సప్తమ స్థానం అయినటువంటి శని ప్రభావం బాగా లేకపోవడం వల్ల ఇబ్బంది పెరుగుతుంది కానీ ఈ ఆలోచన పక్కన పెట్టండి మీ శక్తికి తగిన ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి. ఇది నిరంతరము చేసేటువంటి ప్రయత్నం వల్ల అనుభవం పెరుగుతుంది. అలాంటి అనుభవంతో మీరు మంచి స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి. ధనానికి లోటు ఉండదు అలాగని ప్రయత్నానికి కూడా లోటు ఉండదు కానీ చిన్నచిన్న లోపాలు ఉన్నాయి అవి సరిగా చూసుకుంటే మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది. ఒక స్త్రీ ద్వారా మీకు మంచి ప్రోత్సాహం ఉత్సాహం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మాట్లాడకండి. అత్యంత ఆత్మీయంగా మాత్రమే ఉండండి కానీ చనువు తీసుకోవద్దు. చిన్న జంకు మీలో ఉండి పోయింది. అది తొలగించడానికి ప్రయత్నం చేయండి. దాని వలన మేలు జరుగుతుంది.మీకు ఈ వారంలో 48శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పుష్యమి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకుమిత్ర తార అయింది కృషి చేస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది.

పరిహారం :- కార్తీక మాసం ప్రతిరోజూ శివునికి అభిషేకం చేయండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. గురుస్తోత్రం మర్చిపోకండి. గోవును నిత్యము చూసి నమస్కారం చేయండి.

సింహరాశి :- ఈ రాశి వారికి సంపదలు భూషణములు ధనము ఇలాంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. సహజంగా ఇది అందరం కోరుకుంటాము. కానీ ఒక అనారోగ్య సూచన చాలా ఎక్కువగా ఉన్నాయి. అగౌరవ పడే కొన్ని సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత మీ ప్రయత్నం ముందుకు వెళుతూ ఉంటుందో అంత కూడా గౌరవానికి భంగం కలుగుతుంది. గురు శుక్ర శనులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆత్మీయంగా మాట్లాడగలిగినట్లయితే పనులన్నీ సులువుగా చక్కగా నెరవేరుతాయి. ఎక్కడెక్కడ మీకు అనుకూలత తక్కువ ఉంటుంది అనేది మీకు సూచనా మార్గం అందుతుంది. దాన్ని మీరు గ్రహించాలి మీకు అలాంటి శక్తి సామర్ధ్యాలు కూడా ఉన్నాయి. శుభప్రదమైనటువంటి కార్యానికి మంచి రోజులే మునుముందు రాబోతున్నాయి. వాటిని మీరు వినియోగించుకుంటే ఇంకా బాగుంటుంది. వారంతంలో మీకు ధనం వ్యయముంది రాహుకేతువుల అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. దానివల్ల కూడా గౌరవ భంగం జరిగే అవకాశం ఉంది ఏదైతేనేం ఈ వారంలో 48 శాతం శుభఫలితాలు ఉన్నాయి.మఖా నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తర 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం :- సూర్యునకు, రాహు కేతువులకు పూజలు చేయించండి కాలసర్ప దోషం పూజ చేయిస్తే మంచిది.

కన్యారాశి :- ఈ రాశి వారికి సంపద స్వర్ణాకర్షణ ప్రాప్తి మానసిక శాంతి మీకు లభిస్తున్నది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి శత్రువులు సహజంగానే కొనసాగుతున్నారు. సర్వసంపదలు పొందడానికి కూడా మీకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. ప్రయత్నంలో కొంత వరకు కృతకృత్యులు అవుతారు అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది . ఇంతకుముందు మీరు ఏవేవి అయితే సాధించలేము అనుకున్నారు అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీకు చక్కని సాధన సంపత్తిని కలిగిస్తాయి దేనికి శుక్రుడు తాలూకా సహకారం లభిస్తోంది. మీరు ఎంత లబ్ధి పొందిన కొంత నష్టం లేదా వ్యయం తప్పదు. మీ సొంత ఆలోచన అయితే పనిచేయవు. అని మీరు ఇతరుల మీద కొంత ఆధారపడి అది ప్రత్యేకించి గురువు మీద ఆధారపడి నట్లయితే మీకు కొంత వరకు మంచి జరుగుతుంది. లగ్నంలో శుక్రుడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. అన్నిటినీ అధిగమించే శక్తి మీలో ఉంది కానీ తాత్కాలికంగా ధైర్యం చాలక కోరిక లేకపోవడం వల్ల స్పందించడం లేదు. ఇప్పుడు మీకు సానుకూల గ్రహస్థితి ప్రారంభమైంది కాబట్టి అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. చేకూరుతాయి క్రమక్రమంగా అభివృద్ధి అంతా ఒక్కసారిగా మీకు ఏది కూడా అనుకూల పడదు. ఈ రాశివారికి ఈ వారంలో 48 శాతం ఫలితాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. చిత్త 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- గురువార నియమాలు పాటించండి. గురువుగారికి సహకరించండి. గురు చరిత్ర చదవండి మేధా దక్షిణామూర్తి స్తోత్రం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

తులా రాశి :- ఈ రాశి వారికి అదృష్టము ధనలాభము ఉత్సాహం చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కానీ వాటిని వినియోగించుకోలేక మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా . ఈ వారంలో వీరికి బుధ గురులు ఇద్దరూ కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఆందోళన తీవ్రంగా ఉంటుంది. ఆలోచన కూడా స్థిరంగా ఉండదు. మీరు ఉత్సాహాన్ని లోపలినుండి తెచ్చుకోవాలి తప్ప బయట మీకు ఏ కోశానా ప్రోత్సాహం లభించదు. సహజంగా వీరు సమతుల్య స్థితిని పొందగలుగుతారు కానీ శని రాహు కేతువు ల యొక్క ప్రభావము వీరిని అనారోగ్యం పాలు చేస్తుంది. వస్తువులు పోగొట్టుకునే స్థితి మాట కటుత్వము ఇవన్నీ పొందగలుగుతున్నారు. దీనివల్ల అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చంద్రుడు మానసిక దుర్బలత్వం కలగ చేస్తున్నాడు. వీటిని అధిగమించడానికి ఏకాగ్రత మాత్రమే ముఖ్యమైన అనువైన సాధనము. శుక్రగ్రహ అనుకూలత మీకు సగానికి సగం బలాన్ని చేకూరుస్తుంది. దాన్ని మీరు పూర్తిగా వినియోగించుకో గలిగితే మీరు ఏదైనా సాధించవచ్చు. ఈ వారంలో మీకు రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రాప్తి ధనప్రాప్తి రెండు ఉన్నాయి వాటిని పొందడానికి ప్రయత్నాలు చేయండి. మంచి ఆరోగ్యకరమైన ఆలోచన మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది మీకు ఈ వారం లో 40 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్తా 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలరు. స్వాతి నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. విశాఖ 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం: శనికి జపము హోమము నల్ల నువ్వులు దానం చేయండి తైల అభిషేకం చేయించండి. శని స్తోత్రం పఠించండి. రుద్రాభిషేకము విశేష ఫలితము.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారు కుటుంబంతో హాయిగా ఉండే అనుకూల పరిస్థితులు, ధనలాభము, ఉత్సాహం ఇవన్నీ కూడా అత్యంత ప్రోత్సహిస్తూ స్థిరాస్తి వ్యవహారాల్లోనూ గౌరవ మర్యాదలను సంపాదించుకుని గొప్ప ఆనందాన్ని అనుభూతిని పొందగలుగుతారు. స్థానచలనం, దూర ప్రయాణము కుటుంబ గౌరవ మర్యాదలు కి సంబంధించినటువంటి బాధ్యతలు మీ చేతిలో ఉంటాయి. మీరు చాలా ఆనందాన్ని అనుభూతిని పొందుతారు ఇతరులచే పొంద జేయగలుగుతారు. ఉత్సాహం మిమ్మల్ని మీతో పాటు చాలా మందిని ఆనందింపజేసే స్థితి ఉంటుంది. కానీ లోపల మీకు చిన్న భయం కూడా ఉంటుంది. దాన్ని దూరం చేసుకోండి కుజ ప్రభావం చేత శత్రువులు కూడా మీకు ఎక్కడపడితే అక్కడ ఉంటారు వారి నుండి దూరంగా ఉండాలి ప్రయత్నించండి. మాట మీద నిలబడండి మంచి మాటను పొందండి మంచి పేరు పొందగలుగుతున్నారు. మీకు క్రమక్రమంగా మంచి రోజులు వస్తున్నాయి అనడానికి సంకేతాలుగా ఉపయోగపడతాయి. గృహంలో కల్యాణాది శుభప్రదమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బుధుడు అనుకూలంగా లేడు కనుక ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి మేలు జరుగుతుంది. మీకు ఈ వారంలో 48శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనురాధ నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ట నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కృషి చేస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది.

పరిహారం :- ఏకాగ్రత కోసం ప్రయత్నించండి. ధ్యాన స్థితి మంచి ఉపకరిస్తుంది. ముందు రోజు నాన వేసిన పెసలు బుధవారం నాడు ఉదయం బెల్లం వేసి ఆవుకు తినిపించండి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

ధను రాశి :- ఈ రాశి వారికి లాభము, మృష్టాన్న భోజనం, సంతోషము, ఆనందము, సుఖజీవితం చివరిగా ధనలాభం ఇవన్నీ వీరిని గొప్ప ఆలోచన పరంగా తయారు చేసి మంచి మార్గంలోకి నడిపిస్తాయి. ఇంతవరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ వారం నుండి ఒక జాతకంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. శత్రుపీడ కుజ ప్రభావం వల్ల ఉంది కానీ అది కూడా మురిగిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. వీరికి బుధ శుక్రులు అనుకూలంగా ఉండటం చాలా ఉత్సాహం సంతోషం ఎక్కువ అన్నమాట అదే భావన మీకు మరింత మంచిది. కుటుంబ ఆనందం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. దానికి తగిన ప్రతిఫలాన్ని మానసికంగా పొందగలుగుతారు. గురుడి ప్రభావం చేతవ్యాపారంలో గానీ విద్యా వ్యాసంగం విషయంలో గానీ మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని మీరు సరిదిద్దుకో గలిగితే వాటిలో కూడా వినియోగించుకో గలిగితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ వారంలో 48 శాతం శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మూలా నక్షత్రం జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం: ద్వితీయ శని దోషం పోవడానికి జపం చేయించండి హోమాదులు జరిపించండి దానధర్మాలు చేయండి. సహస్ర లింగార్చన ఎక్కువ లాభాన్ని చేకూరుస్తాయి. నిత్యం శివ దర్శనం మంచిది.

మకర రాశి :- ఈ రాశి వారికి 72 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఎవరికి కూడా ఇంత శాతం శుభ ఫలితాలు లేవు. ఈ వారంలో పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గురు శనులు అనుకూలత లేదు కానీ తదితర గ్రహాలన్నీకూడా సహకరించడం వల్ల విశేష ఫలితాలు పొందగలుగుతున్నారు. సంతోషము ధనము ఒకటేమిటి ఇవన్నీ వీరు పొందడమే కాదు ఇతరులకు కూడా పొందేటట్లు చేస్తారు. వీరిలో ఒక దుర్గుణం ఉంది ఎంత వచ్చినా సరే పదిమందికి పెట్టడానికి ఇష్టపడరు . దానివల్ల ఉన్న సొమ్మని ఖర్చు పెట్టక తాను తినక అనుభవించే యోగ లేకుండా పోతారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఇంట్లో శుభకార్యాలు కలిసివస్తాయి. పదిమంది చేరి అభినందించే మంచి ఉద్యోగం గాని ఆర్థిక లావాదేవి లేదా చదువు పొందే అవకాశాలు ఈ వారంలో వీరికి ఉన్నాయి. ప్రతికూలతలు చాలా తక్కువ. ఉత్తరాషాఢ నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. శ్రవణం నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ధనిష్ఠ 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం: శని గురు జపం చేయించండి గ్రహమఖం (యజ్ఞం ) చేస్తే చాలా మంచిది. గురు, మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠనం మరువకండి.

కుంభ రాశి :- ఈ రాశి వారికి కార్య లాభము స్థిరాస్తి వ్యవహారములు చక్కబడి ఉంటే మంచి స్థితిని పొందగలుగుతారు. వీరికి శని రాహు కేతు ప్రభావం చేత చిన్న అగౌరవాదులను పొందినా సరే నిలదొక్కుకుని మళ్ళీ ముందుకు సాగే అవకాశం ఉంది. మాటకారితనంతో ముందుకు సాగిపోతారు కానీ ఒక దగ్గర అదే మాట కష్టానికి కారణం అవుతుంది కాబట్టి ఎంత ఆలోచించి అడుగు వేస్తే అంత ప్రయోజనం పొందగలుగుతున్నారు. కుజ బుధ ప్రభావాలు చేత మీరు ఎక్కువగా ఆర్థిక ఇబ్బంది పడే అవకాశం మాత్రం కనిపిస్తోంది. అటువంటి సమయాల్లో ధైర్యం వహించి గురువు ఆశీర్వాద వాక్యం చేత ముందుకు సాగినట్లయితే ఏ పనికి ఇబ్బంది కలగదు. స్వతంత్రంగా చేసే పనులలో మాత్రం కొంత ఇబ్బంది ఉంది. శని ప్రభావం చేత ఉన్న ఉద్యోగం కూడా పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార ఉద్యోగాల్లో మీరు ఆచితూచి అడుగు వేయండి. స్థిరాస్తి కోర్టు వ్యవహారాల్లో ఈ వారంలో ముందుకు వెళ్ళకండి. ఈ వారంలో మీకు 48శాతం శుభ ఫలితాలు పొందే అవకాశాలుఉన్నాయి. ధనిష్ఠ 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలుగుతారు. శతభిషం నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం :- శని జపం చేయించండి. నవగ్రహ దర్శనం. నిత్యము రుద్రాభిషేకము చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. గో సందర్శనము శివ సందర్శనము ప్రతిరోజు మీ జాతకానికి చాలా అవసరం.

మీన రాశి :- ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతున్నట్లు చేతికి అంది వచ్చినట్లు ధనము సంపద మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు అనిపిస్తాయి. కానీ ఇవన్నీ ఎండమావి. ఇలాంటివి మీకు గ్రహస్థితి పూర్తి అనుకూలంగా ఉందని మాత్రం చెప్పలేను కానీ కష్టానికి తగిన ఫలితం మాత్రమే వస్తూ ఉంటుంది. తృప్తి పడడం అనేది మీరు అలవాటు చేసుకుంటే తప్పదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఉంటాయని మనం చెప్పలేకపోతున్నాము. సర్వసంపదలు భూసంపద కూడా పొందే అవకాశం లేకపోలేదు కానీ ఏది కూడా మిమ్మల్ని తనంత తానుగా వచ్చి చేరుతుంది అని నమ్మకం కలిగించలేము. మీకు ఎన్ని ఉన్నా కష్టం అనేది ఉంటుంది తప్పదు. శ్రమ పడకుండా మీ పనులు కూడా పూర్తికావు. అనారోగ్యం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు వెన్నంటి ఉంటుంది. సకాలంలో మీకు ధనం అందుతుంది కాబట్టి ఇబ్బందుల నుంచి బయట పడతారు అంతవరకే చెప్పగలము. శత్రువులు మీ తాలూకా రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకుండా కార్య అనుకూలతను బట్టి నమ్మటం నమ్మకపోవడం అనేది అలవాటు చేసుకోవడం చాలా అవసరం. ఈ జాతకులకు 48శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి జన్మతార ఆరోగ్యం జాగ్రత్త వహించండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. రేవతీ నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా బావుంటుంది అని చెప్పొచ్చు.

పరిహారం :- కుజునకు పూజలు చేయించండి.సుబ్రహ్మణ్యం పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శివునకు మృత్యుంజయ మంత్రంతో అభిషేకం కూడా మీ ఆరోగ్యాన్ని నూటికి నూరు శాతం బాగుచేస్తుంది.


Next Story