ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు
CM KCR Good News to RTC Employees
By Medi Samrat Published on 15 Nov 2020 11:20 AM GMTఆర్టీసీ కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని.. ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి తక్షణమే రూ.120 కోట్లు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను సీఎం ఆదేశించారు. హైద్రాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. ఆర్జీసి కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు.
ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ పై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగు వేయకుండా ఆర్టీసీని తిరిగి బతికించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇందులో బాగంగా
ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని సీఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవల తో లాభాలను గడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్‌కు జిల్లాలనుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుతుందని, అందుకోసం హైద్రాబాద్‌లో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సీఎం ఆదేశించారు.