ఫ్యాక్ట్ చెక్ రౌండ్అప్ 2022

Year End Fact-check Roundup 2022. 2022 సంవత్సరంలో న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం కీలకమైన వైరల్ పోస్ట్ ల నిజ నిర్ధారణ చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Dec 2022 1:09 PM GMT
ఫ్యాక్ట్ చెక్ రౌండ్అప్ 2022

2022 సంవత్సరంలో న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం కీలకమైన వైరల్ పోస్ట్ ల నిజ నిర్ధారణ చేసింది. టాప్ టెన్ క్లైమ్స్ రివ్యూ మరోసారి ఇక్కడ అందిస్తున్నాం.

భారీ వర్షాలు పడుతున్న కారణంగా హైదరాబాద్ షేక్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ మీద నుంచి ద్విచక్ర వాహనాలు వెళ్లకూడదని ఒక వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియా తో పాటుగా వివిధ టీవీ ఛానళ్లలో కూడా దాన్ని ప్రసారం చేశారు. అయితే అది నిజంగా హైదరాబాదులోని షేక్ పేట ఫ్లైఓవర్ ఏనా అనే అనుమానాలు చాలావరకు తలెత్తాయి. దీంతో పాటుగా మరి కొంతమంది సోషల్ మీడియాలో ముంబై లో ఉన్న మరొక ఫ్లై ఓవర్ గా కూడా సర్క్యులేట్ చేశారు. దీంతో న్యూస్ మీటర్ ప్యాక్ట్ చెక్ చేసి ఇది పాకిస్తాన్ కరాచీ లో ఉన్న ఫ్లై ఓవర్ గా నిర్ధారణ చేసింది. షేక్ పేట లో ఇటీవలే నిర్మించిన ఫ్లైఓవర్ కాదని ఇది ఫేక్ న్యూస్ అంటూ నిర్ధారించింది.

https://telugu.newsmeter.in/fact-check/a-video-of-several-motorcyclists-falling-happened-due-to-heavy-rainfall-at-shaikpet-flyover-697066

సుప్రీం కోర్ట్ జస్టిస్ జేబీ పార్దీవాలా బిజెపి బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆయ‌న‌కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో, గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారనే ఇమేజ్. అందువల్లే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది నెటిజన్లు దాన్ని వైరల్ చేశారు. అయితే అందులో నిజమెంత ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. వైరల్‌గా సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్ ఫాల్స్ క్లెయిమ్‌గా తేలింది.

https://telugu.newsmeter.in/fact-check/is-justice-jb-pardiwala-congress-mla-697420

హైదరాబాదులో ఇటీవలే ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, మోడీ బహిరంగ సభ తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. ప్రముఖ లాయర్, సోషల్ ఆక్టివిస్ట్ ప్రశాంత్ భూషణ్ ట్విటర్లో పోస్ట్ చేసిన ఆ వీడియో మీద నెటిజన్లు చర్చ మొదలు పెట్టారు. మోడీ బహిరంగ సభకు హాజరైన బిజెపి కార్యకర్తలకు లిక్కర్ సప్లై చేశారనేది ఆ వీడియో సారాంశం. అయితే అది మిస్ లీడింగ్ వీడియోగా తేల్చింది న్యూస్ మీటర్.

https://telugu.newsmeter.in/fact-check/did-liquor-supplied-in-modi-meeting-697461

కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం కొలనులోని ఒక మొసలి ఇటీవల మరణించింది. దాదాపుగా 75 సంవత్సరాల వయసున్న ఆ మొసలి పేరు బబియ. ఆ ముసలి కేవలం శాఖాహారం మాత్రమే తీసుకునేదని భక్తులు చెపుతారు. అయితే ఆ మొసలికి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొసలి తలమీద ఒక వ్యక్తి తన తలను ఆనించి ఉంచిన ఆ ఫోటోను నెటిజన్లు వైరల్గా సర్క్యులేట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి చెందిన మొసలి కాదని, సోషల్ మీడియాలో బబియాకి సంబంధించి వైరల్ అయిన క్లెయిమ్ తప్పు అని ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పింది న్యూస్ మీటర్ టీం.

https://telugu.newsmeter.in/fact-check/no-this-viral-photo-does-not-belong-to-kerala-temple-702349

కేదారనాథ్ మందిరం మూసేసి 2 వారాలు దాటిపోయినా కూడా -10° C చలిలో ధ్యానంలో ఉన్న ఈ యోగిపుంగవుణ్ణి చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా సర్క్యులేట్ అయింది. దాంతో ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం, వైరల్ అయిన ఇమేజ్ ను ఎడిట్ చేశారని, ఆ బాబా దేహం మీద ఉన్నది మంచు కాదు విభూతి మాత్రమేనని తేలింది.

https://telugu.newsmeter.in/fact-check/photoshopped-image-shows-seer-doing-meditation-at-kedarnath-temple-703573

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారి దర్శనానికి ఏటా లక్షలాదిగా భక్తులు తిరుమల కొండపైకి చేరుకుంటారు. ప్రతినిత్యం భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి తిరుమల గిరులు. అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. తిరుమలలో ఉన్న వెంకంటేశ్వర స్వామి గుడిలో భక్తులు లేనప్పుడు స్వామివారిని డైరెక్టుగా దర్శించుకునే అనుగ్రహం కలిగినది, మనందరికీ కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అనే వీడియో అది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఆ వీడియో పరిశీలించి చూసినప్పుడు ఆ దేవాలయం నిజంగా తిరుమల తిరుపతి దేవాలయం కాదని, అలిపిరిలో ఉన్న నమూనా దేవాలయం తెలిసింది.

https://telugu.newsmeter.in/fact-check/the-venkateswara-swamy-temple-in-tirumala-when-there-are-no-devotees-703351

మక్కాలో ఉన్నది సాక్షాత్తు ఈశ్వరుని ప్రతిరూపం, ఆ మహా దేవుని శివలింగం అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. అప్పటి మన శివలింగాన్ని తరతరాలుగా మూసివేశారు అంటూ, 1480 నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులతో కూడిన ఒక వీడియోని ఫేస్ బుక్ లో ఒక నెటిజన్ షేర్ చేశారు. ఆ వీడియోలో నిజమెంత? తెలుసుకునేందుకు ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం, వైరల్ గా సర్కిల్ అవుతున్న వీడియో మిస్ లీడింగ్ వీడియోగా తేలింది.

https://telugu.newsmeter.in/fact-check/misleading-video-is-virally-circulated-as-shiva-ling-in-makkah-704040

గులాబ్జామ్ ఉన్న ఒక పాత్రలో ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేస్తున్నారని, ఏవైనా వస్తువులు కొనుక్కొని తినే ముందు చూసి జాగ్రత్త పడాలి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా సర్క్యులేట్ అయింది. ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం, అది ఫ్రాంక్ వీడియోగా తేల్చింది.

https://telugu.newsmeter.in/fact-check/a-prank-video-is-shared-on-social-media-with-a-false-narrative-704649

చైనా స్కూళ్ళలో తమ బిడ్డల చదువు కోసం, వారి ఉన్నత భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు, తమ రక్త మాంసాలను కరిగించి తమకు మంచి భవిష్యత్తు కోసం పాటుపడతారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు చూపించి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తున్నారు. కచ్చితంగా ఈ వీడియో చూసిన పిల్లలకు చైతన్యం కలిగితే వారు ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో నిలబడతారు అనడానికి చక్కటి ఉదాహరణగా ఈ వీడియో మిగిలిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తినిచ్చే వీడియో ఇది అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. అయితే చైనాలోని ఒక పాఠశాలలో తమ టీచర్ చనిపోయారని స్టూడెంట్స్ ఏడుస్తున్న దృశ్యాలను ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోను పోస్ట్ చేస్తే, వైరల్ వీడియోను స్టూడెంట్స్ బోర్డు వైపు చూస్తున్నట్టుగా దాని పైన కొన్ని వీడియోలు కనిపించేలా ఎడిట్ చేసినట్లు తెలిసింది.

https://telugu.newsmeter.in/fact-check/edited-video-shared-as-visuals-of-chinese-schools-showing-students-video-of-their-parents-hardwork-705158

మొబైల్ ఇయర్ ఫోన్‌లో నెట్ యాక్టివేట్ కావడంతో రైలులోని హైటెన్షన్ కేబుల్ నుంచి కరెంట్ పాస్ అయ్యి, చెవి ద్వారా మెదడుకు చేరుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది..? అది మీరే చూడండి. అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇయిర్ ఫోన్‌లను , బ్లూ టూత్ ఉపయోగించకుండా మరియు ప్లాట్‌ఫారమ్‌పై "రైలు మార్గానికి దగ్గరగా" నిలబడకుండా ఉండండి అనే సందేశంతో ఒక నెటిజన్ ఫేస్బుక్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నిజం ఎంత?! ప్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. రెండు తీగలు వేరొకదానితో తాకడంతో ఒక తీగ స్నాప్ అయి కిందపడటంతో, TTE అధికారి విద్యుత్ షాక్‌కు గురైయ్యారని తేల్చింది టీం.

https://telugu.newsmeter.in/fact-check/was-tte-got-electrocuted-due-to-ear-phones-at-railway-station-705413


Next Story
Share it