చైనా స్కూల్స్ లో స్టూడెంట్స్ కు పేరెంట్స్ పనిచేస్తున్న వీడియోలు చూపిస్తున్నారా?!

చైనా స్కూళ్ళలో తమ బిడ్డల చదువు కోసం, వారి ఉన్నత భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు, తమ రక్త మాంసాలను కరిగించి తమకు మంచి భవిష్యత్తు కోసం పాటుపడతారు.

By Nellutla Kavitha  Published on  17 Dec 2022 1:32 PM GMT
చైనా స్కూల్స్ లో స్టూడెంట్స్ కు పేరెంట్స్ పనిచేస్తున్న వీడియోలు చూపిస్తున్నారా?!

చైనా స్కూళ్ళలో తమ బిడ్డల చదువు కోసం, వారి ఉన్నత భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు, తమ రక్త మాంసాలను కరిగించి తమకు మంచి భవిష్యత్తు కోసం పాటుపడతారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు చూపించి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తున్నారు. కచ్చితంగా ఈ వీడియో చూసిన పిల్లలకు చైతన్యం కలిగితే వారు ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో నిలబడతారు అనడానికి చక్కటి ఉదాహరణగా ఈ వీడియో మిగిలిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తినిచ్చే వీడియో ఇది అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది.

నిజనిర్ధారణ

చైనా స్కూళ్ళలో స్టూడెంట్స్ కు తల్లిదండ్రులు పని చేస్తున్న వీడియోలు చూపిస్తున్నారు అన్న వైరల్ వీడియో లో నిజం ఎంత?! ఫ్యాక్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు సోషల్ మీడియాలో ఇదే వీడియోకి సంబంధించి ఇతర పోస్టులు కనిపించాయి. ఇదే వీడియోని ఫేస్ బుక్ లో రీటా గుప్తా అనే ఒక నెటిజన్ జపాన్ లోని ఒక పాఠశాలలో స్టూడెంట్స్ కు తమ పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిస్తున్నారో తెలుసుకోవడానికి వీలుగా ఈ వీడియోని చూపిస్తున్నారు అంటూ ఇదే వీడియో షేర్ చేశారు.

ఇక టర్కీకి చెందిన మరొక నెటిజన్ కూడా ఇదే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది వైరల్ గా సర్క్యులేట్ అయింది.

ఇక ఈ ట్వీట్ కిందే మరొక నెటిజన్ కామెంట్ చేశారు. జపాన్ స్కూల్ లలో చేస్తున్న ఈ పని చాలా ఉపయుక్తంగా ఉందంటూ ఆ నెటిజన్ రిప్లై ఇచ్చారు.

అయితే నైజీరియాకు చెందిన మరో నెటిజన్ ఇదే వీడియోని కొన్ని రోజుల క్రితం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రతి విద్యా సంవత్సరం మొదట్లో చైనాలో విద్యార్థులు అందరూ తప్పనిసరిగా ఈ వీడియోను చూస్తారని, దీంతో వారిలో నైతిక విలువలు పెరుగుతాయి అంటూ పోస్ట్ చేశారు. అయితే దీనిని ఖండిస్తూ మరొక నెటిజన్ రియాక్ట్ అయ్యారు. తనకు చైనాలో కొంతమంది ఫ్రెండ్స్ తెలుసని, వారెవరూ ఇలాంటి వీడియోలు స్కూల్స్లో ప్లే చేస్తారని చెప్పలేదని కామెంట్ చేశారు ఆ నెటిజన్.

ఈ వైరల్ వీడియోను గమనిస్తే స్టూడెంట్స్ బోర్డు వైపు చూస్తున్నప్పుడు దాని పైన కొన్ని వీడియోలు కనిపించేలా ఎడిట్ చేసినట్లు గమనించవచ్చు. ఇక క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ఏడుస్తున్న దృశ్యాలకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు యూట్యూబ్ లో మాకు కొన్ని వీడియోలు కనిపించాయి. తైవాన్ లొకేషన్ తో ఉన్న Truth అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను మొదటగా పోస్ట్ చేసింది. చైనాలోని ఒక పాఠశాలలో తమ టీచర్ చనిపోయారని స్టూడెంట్స్ ఏడుస్తున్న దృశ్యాలు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది.

https://www.youtube.com/@zhenxj/షార్ట్స్


అనారోగ్య కారణంగా Liupanshui, Guizhou లో ఉన్న స్కూల్ లో పనిచేస్తున్న 40 ఏళ్ల లోపువయసున్న టీచర్ మే 24న మరణించారని ఈ వీడియోని మే 26న పోస్ట్ చేశారు.
https://www.youtube.com/shorts/xLfm74S4D2U
ఇదే వీడియోని మరొక యూట్యూబ్ ఛానల్ లో కూడా చూడవచ్చు
https://www.bilibili.com/video/BV1Q34y1j7j4/




సో, చైనాలోని స్కూల్స్ లో స్టూడెంట్స్ కు వారి పేరెంట్స్ పనిచేస్తున్న వీడియోలు చూపిస్తున్నారు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.

Claim Review:Chinese Schools Showing Students Video Of Their Parents Hardwork
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story