కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దర్శనానికి ఏటా లక్షలాదిగా భక్తులు తిరుమల కొండపైకి చేరుకుంటారు. ప్రతినిత్యం భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి తిరుమల గిరులు. అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. తిరుమలలో ఉన్న వెంకంటేశ్వర స్వామి గుడిలో భక్తులు లేనప్పుడు స్వామివారిని డైరెక్టుగా దర్శించుకునే అనుగ్రహం కలిగినది, మనందరికీ కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అనే వీడియో ఇది.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఈ వీడియోలో నిజమెంత?
నిజ నిర్ధారణ
నాలుగు వేలకు పైగా షేర్లు, రెండున్నర లక్షల వ్యూస్ కు పైగా ఉన్న ఈ వీడియోలో అదే సంఖ్యలో కామెంట్లు కూడా కనిపించాయి. వాటిని ఒకసారి పరిశీలించి చూసినప్పుడు ఈ దేవాలయం నిజంగా తిరుమల తిరుపతి దేవాలయం కాదని, అలిపిరిలో ఉన్న నమూనా దేవాలయంగా చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. దీంతో కీ ఫ్రేమ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం.
దీంతో ఈ వీడియోకి సంబంధించి మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో గతంలోని పోస్ట్ అయినట్టుగా న్యూస్ మీటర్ గమనించింది. SVBC ఛానల్ దీనిని నిర్మించిందని కొందరు యూట్యూబ్ వీడియోలు పోస్ట్ చేశారు.
దీంతోపాటుగా టీవీ9 గతంలో చేసిన ఒక వీడియో కూడా కనిపించింది.
అలాగే గత సంవత్సరం కాస్త ఎక్కువ నిడివి ఉన్న మరొక వీడియో కూడా ఇదే దేవాలయానికి సంబంధించి కనిపించింది. ఇందులో తిరుమల తిమ్మప్ప గా స్వామిని అభివర్ణించారు.
ఇక ఈ వీడియోని ఒకసారి పరిశీలించి చూసినట్లయితే, ఇందులో ఉన్న పరిసరాలు, గోడలు, రాతి కట్టడాలు కాదని, కప్ బోర్డ్స్ తో నిర్మించిన కట్టడాలుగా అర్థమవుతుంది. మరోవైపు ఆలయ గర్భగుడి అని చెప్పినప్పటికీ, వీడియోలో కనిపిస్తున్న బస్తా సంచులతో పాటుగా లోపల ఉన్న రెడ్ బకెట్ తో కూడా ఇది నిజమైన నా గర్భగుడి కాదని తెలుస్తుంది.
దీంతోపాటే మరోసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన వెబ్ సైట్ లో 2015 కు సంబంధించి, ఈ నమూనా దేవాలయంపై ఒక న్యూస్ ఐటమ్స్ కనిపించింది. TTD BOARD CHIEF VISITS REPLICA TEMPLE, ఇందులో ఉన్న ఫోటోలో కనిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్, వైరల్గా సర్క్యులేట్ అయిన ఆ వీడియోలో ఉన్న బ్యాగ్రౌండ్ ఒకటే.
టీటీడీ నమూనా దేవాలయానికి సంబంధించి గూగుల్ ఇమేజెస్ వెదికినప్పుడు కూడా ఆ వీడియోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ కనిపించింది.
సో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భ గుడి వీడియో నిజం కాదు.