కేదారనాథ్ మందిరం మూసేసి 2 వారాలు దాటిపోయినా కూడా -10° C చలిలో ధ్యానంలో ఉన్న ఈ యోగిపుంగవుణ్ణి చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా సర్క్యులేట్ అయింది.
https://scontent.fhyd2-2.fna.fbcdn.net/v/t39.30808-6/314953884_500714425433984_4340191794232250915_n.jpg?_nc_cat=111&ccb=1-7&_nc_sid=973b4a&_nc_ohc=jM5hEtS0e7UAX8TVepX&_nc_ht=scontent.fhyd2-2.fna&oh=00_AfD85UjgZJ1W5ZPUeZcUmmOoQFGucyRgH_rGSFXNQsu8IQ&oe=637655CC
నిజ నిర్ధారణ :
నిజంగానే కేదార్నాథ్ ఆలయం దగ్గర ధ్యానంలో -10 డిగ్రీల సెల్సియస్ దగ్గర మంచుతో కప్పబడి ఉన్న యోగి కనిపించారా? ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసినప్పుడు గతంలోనూ, హిమాలయాల్లో మంచుతో కప్పబడిన ఒక యోగి కనిపించాడు అంటూ అదే ఫోటో వైరల్ గా కూడా కనిపించింది.
https://twitter.com/realskpanchal01/status/1483352630264885250?
దీంతోపాటు గానే మాకు ఒక ఫేస్బుక్ పేజీ కూడా కనిపించింది
https://www.facebook.com/permalink.php?story_fbid=973326499796725&id=446762502453130
బాబా సర్భంగి / మహంత్ బాబా భలే గిరి జీ సర్భంగి మహారాజ్ పేరుతో ఈ ఫేస్ బుక్ పేజ్ కనిపించింది. ఇదే పొజిషన్ లో కూర్చున్న మరొక ఇమేజ్ కూడా తన ఫేస్బుక్ పేజీలో కనిపించింది.
https://www.facebook.com/permalink.php?story_fbid=697873170675394&id=446762502453130
బాబా సర్భంగీ మహారాజ్ కి సంబంధించిన ఇదే ఫోటోని వివిధ రకాలుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టుగా అర్థమవుతోంది. అగ్ని తపస్య అనే ఒక ప్రక్రియలో భాగంగా బాబా సర్భంగి కూర్చొని ఉన్న వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో బాబా దేహం పైన ఉన్నది మంచు కాదు, అది విభూతిగా మనకు అర్థమవుతుంది.
https://fb.watch/gNJ8QIzRc4/
దీనితోపాటుగా బాబా భలే గిరి మహారాజ్ కి ఒక చెందిన యూట్యూబ్ ఛానల్ కూడా అగ్ని తపస్య కు సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేసింది.
https://youtu.be/BInZHf_6J0k
ఇక ఈ వీడియోలో బాబా సహాయకులు తనమీద విభూతి చల్లుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తాయి.
https://youtu.be/HqK6YjWiJaU
సో, కేదార్నాథ్ ఆలయం దగ్గర -10 డిగ్రీల సెల్సియస్ లో మంచుతో కప్పపడిపోయి ఒక యోగి ధ్యానం చేసుకున్నాడంటూ వైరల్ అయిన ఇమేజ్ ను ఎడిట్ చేశారు. ఆ బాబా దేహం మీద ఉన్నది మంచు కాదు విభూతి మాత్రమే, అంటే వైరల్ ఇమేజ్ లో నిజం లేదు.