FactCheck : మక్కాలో ఉన్నది సాక్షాత్తు ఈశ్వరుని ప్రతిరూపమా?
Misleading Video Is Virally Circulated As Shiva Ling In Makkah.
By Nellutla Kavitha Published on 23 Nov 2022 11:13 PM ISTమక్కాలో ఉన్నది సాక్షాత్తు ఈశ్వరుని ప్రతిరూపం, ఆ మహా దేవుని శివలింగం అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. అప్పటి మన శివలింగాన్ని తరతరాలుగా మూసివేశారు అంటూ, 1480 నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులతో కూడిన ఒక వీడియోని ఫేస్ బుక్ లో ఒక నెటిజన్ షేర్ చేశారు.
మరొక నెటిజన్ 1950లో కబాలీశ్వరనాథ్ దేవాలయంగా దీనిని వర్ణించారు. కాబా, మక్కాలో ఉన్నది శివలింగమే అంటూ ట్విట్టర్ లో ఒక యూజర్ పోస్ట్ చేశారు.
Kaaba in 1950 clearly showing this is a Hindu temple the stone is a Hindu idol. pic.twitter.com/jPX62dL6XO
— Sundance (@Sundanc72815822) July 20, 2020
నిజ నిర్ధారణ:
సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలో నిజమెంత? తెలుసుకునేందుకు ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం మొదటగా ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే 2 అంశాలను గమనించింది న్యూస్ మీటర్ టీం. కాబా 1480 అని వీడియో ప్రారంభంలో కనిపిస్తున్న ఫ్రేమ్ ని గమనించినప్పుడు, అక్కడ ఒక ఎరుపు రంగులో ఉన్న బోర్డ్ కనిపిస్తుంది. దీంతోపాటుగానే కింది భాగంలో నలుపు రంగులో గొడుగు పట్టుకుని ఉన్న వ్యక్తి కూడా కనిపిస్తారు. అలాగే ఇది ఒక ఫోటో లాగా అర్థమవుతుంది. ఇక ఫేస్బుక్ లో ఈ వీడియోని గమనించినప్పుడు కూడా కామెంట్స్ సెక్షన్ లో కొంతమంది ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇక మొట్టమొదటి కెమెరాని 1816లో రూపొందించారు.
https://en.wikipedia.org/wiki/History_of_the_camera.
ఎరుపు రంగు బోర్డు మీద కనిపిస్తున్న అక్షరాలు ట్రాన్స్లేట్ చేసి చూసినప్పుడు అరబిక్ భాషలో కొకకోలా అని కనిపిస్తోంది. కొకకోలా ను మొదటగా 1892లో తయారు చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడాన్ని బట్టి చూస్తే అది ప్రకటన కోసం పెట్టినట్టుగా అర్థమవుతుంది.
https://en.wikipedia.org/wiki/Coca-Cola
ఆ తర్వాత కీ ఫ్రేమ్ సెర్చ్ చేసి చూసింది టీం. దీంతోపాటుగా గూగుల్ లెన్స్ ని ఉపయోగించి న్యూస్ మీటర్ టీం. దీంతో ఇండియా డాట్ కాం వెబ్ సైట్ పబ్లిష్ చేసిన కొన్ని ఫోటోలు లభించాయి. These 13 Rare National Geographic Photos Tell Us How Hajj Was Performed In 1953 పేరుతో 2015 సెప్టెంబర్ 23న పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ లో వైరల్గా సర్క్యులేట్ అయిన ఈ వీడియోలోని మొదటి ఫోటో కనిపిస్తుంది.
1953 నాటి పరిస్థితులను వివరిస్తున్న ఈ ఫోటోలను aimislam, National Geographic Magazine నుంచి తీసుకున్నట్టుగా వివరించారు.
ఈ వెబ్ సైట్ లో ప్రచురించిన ఆ ఆర్టికల్ లో ఉన్న చివరి ఫోటోలో కోకో కోలా కి సంబంధించిన ఒక ఫోటో కనిపిస్తుంది. వైరల్ అయిన వీడియోలో మనకు 1480 కి సంబంధించిన మొదటి ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలో ఉన్న బోర్డులో కనిపించిన అక్షరాలు, ఈ ఆర్టికల్ లో చివరి ఫోటోలో కోకోకోలా సూచించేలా ఉన్న అక్షరాలు ఒక్కటే.
నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కి చెందిన 38, 46 పేజీలలో ఈ ఫోటోలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
https://ia600504.us.archive.org/32/items/195304/1953-07_text.pdf
సో మక్కా లో ఉన్నది సాక్షాత్తు ఈశ్వరుని ప్రతిరూపం మహాలింగం అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా సర్కిల్ అవుతున్న వీడియో మిస్ లీడింగ్ వీడియో.