భారీ వర్షాలు పడుతున్న కారణంగా హైదరాబాద్ షేక్పేట లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ మీద నుంచి ద్విచక్ర వాహనాలు వెళ్లకూడదని నిన్న ఒక వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియా తో పాటుగా వివిధ టీవీ ఛానళ్లలో కూడా దాన్ని ప్రసారం చేశారు. అయితే అది నిజంగా హైదరాబాదులోని షేక్ పేట ఫ్లైఓవర్ ఏనా అనే అనుమానాలు చాలావరకు తలెత్తాయి. దీంతో పాటుగా మరి కొంతమంది సోషల్ మీడియాలో ముంబై లో ఉన్న మరొక ఫ్లై ఓవర్ గా కూడా సర్క్యులేట్ చేశారు. దీంతో న్యూస్ మీటర్ ప్యాక్ట్ చెక్ చేసి ఇది పాకిస్తాన్ కరాచీ లో ఉన్న ఫ్లై ఓవర్ గా నిర్ధారణ చేసింది. షేక్ పేట లో ఇటీవలే నిర్మించిన ఫ్లైఓవర్ కాదని ఇది ఫేక్ న్యూస్ అంటూ నిర్ధారించింది.
30 సెకండ్లు ఉన్నటువంటి ఈ వీడియోలో చాలా క్లియర్ గా పాకిస్థాన్ దేశపు జెండా కనిపిస్తోంది.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ ప్యాక్ట్ చెక్ టీం. దీంతోపాటుగానే గూగుల్ మ్యాప్స్ ని కూడా అనుసరించి ఒక నిర్ధారణకు వచ్చింది ఫ్యాక్ట్ చెక్ టీం. వీడియోలో ఉన్న హోండా డ్రైవ్ ఇన్ భవనం తో పాటుగా వివో షోరూం భవనాలను అనుసరించి గూగుల్ మ్యాప్స్ తోపాటుగా స్ట్రీట్ వ్యూ ఇమేజెస్ ను సెర్చ్ చేసి చూసింది టీం.
దీంతో మార్చి 2018 లో తీసిన ఒక స్ట్రీట్ వ్యూ వీడియో ఆధారంగా ఇది పాకిస్తాన్ కు చెందిన ఫ్లై ఓవర్ గా నిర్ధారణకు వచ్చింది టీం. హోండా డ్రైవ్ ఇన్ భవనాన్ని ఆనుకునే ఉన్న అతి పెద్దదైన సైనా డ్రైవ్ ఇన్ రెసిడెన్సీ భవనం కూడా 2018 వీడియోలో కనిపించింది. అదే భవనం ఇప్పటి వీడియోలో కూడా ఉంది. అయితే గతంలో క్యూ మొబైల్ షాప్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు వివో షోరూమ్ కనిపించింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా వచ్చిన నిర్ధారణను పట్టి చూస్తే ఇది కరాచీకి చెందిన ఫ్లై ఓవర్ గా అర్థం చేసుకోవచ్చు.
ఇక గూగుల్ మ్యాప్స్ ను బట్టి చూస్తే రషీద్ మిన్హాస్ రోడ్, కరాచీలోని ఫ్లై ఓవర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే కురిసిన వర్షాలకు ఫ్లైఓవర్ మీద ద్విచక్ర వాహనదారులు పడిపోయినట్టుగా అర్థం అవుతోంది. హైదరాబాద్ షేక్పేట్ లో ఈ సంఘటన జరిగింది అనడం ఫేక్ న్యూస్