విద్యుత్ తీగ మీద పడి TTE షాక్ కు గురయ్యారు, ఇయర్ ఫోన్స్ తో కాదు.

మొబైల్ ఇయర్ ఫోన్‌లో నెట్ యాక్టివేట్ కావడంతో రైలులోని హైటెన్షన్ కేబుల్ నుంచి కరెంట్ పాస్ అయ్యి, చెవి ద్వారా మెదడుకు చేరుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది..? అది మీరే చూడండి.

By Nellutla Kavitha  Published on  22 Dec 2022 2:11 PM IST
విద్యుత్ తీగ మీద పడి TTE షాక్ కు గురయ్యారు, ఇయర్ ఫోన్స్ తో కాదు.

మొబైల్ ఇయర్ ఫోన్‌లో నెట్ యాక్టివేట్ కావడంతో రైలులోని హైటెన్షన్ కేబుల్ నుంచి కరెంట్ పాస్ అయ్యి, చెవి ద్వారా మెదడుకు చేరుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది..? అది మీరే చూడండి. అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇయిర్ ఫోన్‌లను , బ్లూ టూత్ ఉపయోగించకుండా మరియు ప్లాట్‌ఫారమ్‌పై "రైలు మార్గానికి దగ్గరగా" నిలబడకుండా ఉండండి అనే సందేశంతో ఒక నెటిజన్ ఫేస్బుక్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

https://www.facebook.com/100006761327322/videos/vb.100006761327322/684677633283334/?type=2&theater

నిజనిర్ధారణ

వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలో నిజం ఎంత?! ప్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఫేస్బుక్లో నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడడంతో పాటుగా కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసి చూసింది న్యూస్ మీటర్ ప్యాక్ట్ చెక్ టీం. దీంతో లైవ్ వైర్ తగలడంతో వెస్ట్ బెంగాల్ లో టికెట్ కలెక్టర్ ప్లాట్ ఫామ్ మీద పడిపోయినట్టుగా మిర్రర్ టీవీ ఛానల్ డిసెంబర్ 8న ఒక వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.
https://www.youtube.com/shorts/lgVRQMEB4DY
ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుందని టైమ్స్ నౌ ప్రచురించింది. travelling ticket examiner (TTE) కరెంట్ షాక్ తో ప్లాట్ ఫామ్ మీద పడిపోయారని వివరించింది.

https://www.facebook.com/218735715310/posts/pfbid0wPAFrmuSpsfbTzQP5h1txRHLZ7RWe49EurNYZPP9KY4qh4ue5r1b16iTR12Tyn8zl/?sfnsn=wiwspmo&mibextid=6aamW6
ఇక ఇదే సంఘటనకు సంబంధించి అనంత్ రూపనగుడి అనే రైల్వే బ్యూరోక్రాట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

ఇక న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం చేసిన కీ వర్డ్ సెర్చ్ తో TTE వివరాలు కూడా తెలిసాయి. సుజన్ సింగ్ సర్దార్ అనే TTE డిసెంబర్ 7, 2022 న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో మరో అధికారితో ప్లాట్ ఫాం పై మాట్లాడుతన్నపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓవర్ హెడ్ వైరుతో కలిసి ఉన్న కరెంట్ వైరు ప్రమాదవశాత్త తెగి TTE మీద పడటంతో విద్యుత్ షాక్‌కు గురైయ్యారు. రెండు తీగలు మరొకదానికి తగలడంతో ఒక వైరు స్నాప్ అయి ఈ ఆక్సిడెంట్ జరిగి ఉండవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

https://www.india.com/viral/shocking-video-high-voltage-live-wire-falls-on-tc-sujan-singh-sardar-standing-at-kharagpur-station-west-bengal-5791191/
కరెంట్ షాక్‌ కు గురై తీవ్ర గాయాలకు గురైన సుజన్ సింగ్ సర్దార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఖరగ్పూర్ DRM మహమ్మద్ సుజాత్ హష్మి తెలిపినట్లుగా ఇండియా టుడే ఆర్టికల్ లో ఉంది.
ఇక ఖరగపూర్ Senior Divisional Commercial Manager రాజేష్ కుమార్ ఈ సంఘటనకు సంబంధించి మీడియాకు వివరాలు అందించారు. రెండు తీగలు వేరొకదానితో తాకడంతో ఒక తీగ స్నాప్ అయి కిందపడటంతో, TTE అధికారి విద్యుత్ షాక్‌కు గురైయ్యారని, ఈ దుర్ఘటనకు ఎలా జరిగిందనే విషయంలో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు రాజేష్ కుమార్.
https://indianexpress.com/article/cities/kolkata/ticket-checker-electrocuted-at-kharagpur-railway-station-critical-8314565/
ఇక ఈ సంఘటనకు సంబంధించి ఖరగ్పూర్ Chief Ticket Inspector అందించిన వివరాలను "మన ఖరగ్పూర్" అనే ఫేస్బుక్ పేజ్ పోస్ట్ చేసింది. ఓవర్ హెడ్ వైర్ TTE సుజన్ సింగ్ సర్దార్ తల మీద పడటంతో కరెంట్ షాక్‌కు గురైనట్టుగా ఇందులో ఉంది.
https://www.facebook.com/photo?fbid=1493887427788312&set=pcb.1493887511121637
చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్ట్, ఖరగ్పూర్ DRM, ఖరగ్పూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాజేశ్ కుమార్ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఎక్కడకూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయినట్టుగా "మొబైల్ ఇయర్ ఫోన్‌లో నెట్ యాక్టివేట్ కావడంతో రైలులోని హైటెన్షన్ కేబుల్ నుంచి కరెంట్ పాస్ అయ్యి, చెవి ద్వారా మెదడుకు చేరుకుంది" అని లేదు. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో విద్యుత్ తీగ మీద పడి TTE కరెంట్ షాక్ కి గురయ్యారు. ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ పోస్ట్ మిస్ లీడింగ్.

Claim Review:TTE got electrocuted due to ear phones at Railway Station
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:Misleading
Next Story