హైదరాబాదులో ఇటీవలే ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, మోడీ బహిరంగ సభ తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. ప్రముఖ లాయర్, సోషల్ ఆక్టివిస్ట్ ప్రశాంత్ భూషణ్ ట్విటర్లో పోస్ట్ చేసిన ఆ వీడియో మీద నెటిజన్లు చర్చ మొదలు పెట్టారు. మోడీ బహిరంగ సభకు హాజరైన బిజెపి కార్యకర్తలకు లిక్కర్ సప్లై చేశారనేది ఆ వీడియో సారాంశం.
నిజ నిర్ధారణ :
అయితే అది మిస్ లీడింగ్ వీడియోగా తేలింది. ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. కీఫ్రేమ్స్ తో పాటుగా, వీడియో ఎనాలసిస్, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం. ఈ వీడియో 2021 డిసెంబర్ 20 నుంచి యూట్యూబ్ లో ఉన్నట్టుగా తేలింది. దేశ్ నీతి అనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదట దీనిని ఉత్తరప్రదేశ్ కు చెందిన వీడియో గా అప్లోడ్ చేసింది.
శ్రీనివాస్ బి వి అనే యూత్ కాంగ్రెస్ లీడర్ ఇంస్టాగ్రామ్ లో కూడా ఈ వీడియోను అప్లోడ్ చేశారు. దీంతోపాటుగా టెన్ న్యూస్ అనే మరో యూట్యూబ్ ఛానల్ కూడా డిసెంబర్ 22,2021 న ఇదే వీడియోను ఉత్తరాఖండ్ లో హరిద్వార్ లో జరిగిన, జేపీ నడ్డా ర్యాలీకి చెందిన వీడియోగా అప్లోడ్ చేశారు.
ఇక యూపీ కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ లో కూడా డిసెంబర్ 22 వేల 21న ఇదే వీడియో అప్లోడ్ అయింది.
అంటే ఈ వీడియో హైదరాబాద్ లో జరిగిన మోడీ బహిరంగ సభ కు సంబంధించిన వీడియో మాత్రం కాదు. ఇది మిస్ లీడింగ్ వీడియో.