FactCheck : జస్టిస్ జేబీ పార్దీవాలా కాంగ్రెస్ ఎమ్మెల్యే నా?!

Is Justice JB Pardiwala Congress MLA. సుప్రీం కోర్ట్ జస్టిస్ జేబీ పార్దీవాలా ఇటీవల బిజెపి బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన

By Nellutla Kavitha  Published on  6 July 2022 4:23 PM IST
FactCheck : జస్టిస్ జేబీ పార్దీవాలా కాంగ్రెస్ ఎమ్మెల్యే నా?!

సుప్రీం కోర్ట్ జస్టిస్ జేబీ పార్దీవాలా ఇటీవల బిజెపి బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆయ‌న‌కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో, గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారనే ఇమేజ్. అందువల్లే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది నెటిజన్లు దాన్ని వైరల్ చేశారు.

నిజ‌నిర్ధార‌ణ‌ :

అయితే అందులో నిజమెంత ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం.

వైరల్‌గా సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్ ఫాల్స్ క్లెయిమ్‌గా తేలింది.

గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూస్తే 1985 నుంచి 90 వరకు గుజరాత్లోని బుల్సర్ నియోజకవర్గం నుంచి జేబీ పార్దీవాలా వాళ్ళ నాన్నగారు పీబీ పార్దీవాలా ఎమ్మెల్యేగా పనిచేసి, ఏడవ శాసనసభ స్పీకర్ గా పని చేశారని తేలింది.



దీంతోపాటుగా వైరల్ ఇమేజ్ లో, సోనియా గాంధీ తో పాటుగా ఉన్నది భారత దేశానికి మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గా తేలింది. ఈ ఇమేజ్ జనవరి 14, 2007 లో తీసినట్టుగా గెట్టి ఇమేజెస్ లో లభించింది. అంటే ఈ ఇమేజ్ లో ఉంది జేబీ పార్దావాలా కాదు సో ఈ ఇమేజ్ ఫాల్స్ క్లెయిమ్.
























Next Story