FactCheck : గులాబ్ జామ్ స్వీట్లు ఉన్న పాత్రలో మూత్రవిసర్జన చేసారా?

A Prank Video Is Shared On Social Media With A False Narrative. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది.

By Nellutla Kavitha
Published on : 6 Dec 2022 6:24 PM IST

FactCheck : గులాబ్ జామ్ స్వీట్లు ఉన్న పాత్రలో మూత్రవిసర్జన చేసారా?

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. జీహాద్ తరవాత ఇప్పుడు మరో తరహా జిహాద్ బయటపడిందని, దీనికి ఏం పేరు పెట్టాలని ట్విట్టర్ లో ఒక నెటిజన్ ఈ వీడియోని షేర్ చేశారు.

https://twitter.com/doctorrichabjp/status/1598658580785532931?s=20&t=RM1VOH0mS4xFtBfWJKj8OQ

7 సెకన్లు ఉన్న ఇదే వీడియోని మరొక నెటిజన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

గులాబ్జామ్ ఉన్న ఒక పాత్రలో ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేస్తున్నారని, ఏవైనా వస్తువులు కొనుక్కొని తినే ముందు చూసి జాగ్రత్త పడాలి అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా సర్క్యులేట్ అయింది.

నిజనిర్ధారణ :

వైరల్గా సర్క్యులేట్ అయిన ఈ వీడియోలో నిజం ఎంత? ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ట్విట్టర్ తో పాటుగా ఫేస్ బుక్ లోనూ పోస్ట్ అయిన ఈ వీడియో కింద కామెంట్స్ లో కొంతమంది నెటిజన్లు అది ఫ్రాంక్ వీడియోగా అభివర్ణించారు. కాస్త ఎక్కువ నిడివి ఉన్న ఆ ప్రాంక్ వీడియోలో కొంత భాగాన్ని కట్ చేసి వైరల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అని కామెంట్ చేశారు.

https://twitter.com/AijazAwalqi/status/1598811246236925953?s=20&t=RM1VOH0mS4xFtBfWJKj8OQ

దీంతో గూగుల్ కీవర్డ్ సెర్చ్ తో పాటుగా కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో యూట్యూబ్ లో పోస్ట్ అయిన ఒక వీడియో కనిపించింది. వైరల్గా సర్క్యులేట్ అయిన వీడియోలో నిజం లేదని పూర్తినిడివితో ఉన్న వీడియో ని పోస్ట్ చేశారు. వీడియో ఒక యాంగిల్ లో చూస్తే ఒక వ్యక్తి గులాబ్ జామున్ లలో మూత్ర విసర్జన చేస్తున్నట్టు కనిపించింది. అయితే ఈ వీడియోలో 1:20 సెకండ్స్ దగ్గర అదే వ్యక్తి బాటిల్ తో ఏదో ఒక ద్రవాన్ని గులాబ్ జామున్ లో పోస్తున్నట్టుగా కనిపిస్తుంది.

https://www.youtube.com/watch?v=uLvlE4zhCT8


వీటిని పరిశీలించి చూసినప్పుడు ఇది ఇది ఇన్స్టాగ్రామ్ లో రీల్ గా పోస్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి insta ఎకౌంట్లో మీమ్స్, అడల్ట్ కంటెంట్, ప్రాంక్ వీడియోలు పోస్ట్ చేసినట్టుగా ఉంది.

https://www.instagram.com/ashiq.billota/


అయితే వైరల్ అయిన రీల్ కోసం తన ఇన్స్టా ఎకౌంట్లో వెతికితే దీన్ని డిలీట్ చేసినట్టుగా కనిపించింది.




అయితే తన ఇన్స్టా ఎకౌంట్ ను పరిశీలించి చూస్తే మరొక ఎకౌంటుతో అసోసియేట్ అయ్యి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నట్టుగా కనిపించింది.

https://www.instagram.com/funtaap/

ఈ అకౌంట్ లో కూడా ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్ లో ఇలాగే మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా మరొక ప్రాంక్ వీడియో పోస్ట్ చేశారు.


సో, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో నిజానికి ఒక ప్రాంక్ వీడియో. దానిలో కొంత భాగాన్ని ఎడిట్ చేసి వైరల్గా సర్క్యులేట్ చేస్తున్నారు. గులాబ్ జామ్ లలో మూత్ర విసర్జన చేశారని వైరల్ అయిన వీడియో లో నిజం లేదు.


Claim Review:గులాబ్ జామ్ స్వీట్ల్ ఉన్న పాత్రలో మూత్రవిసర్జన చేసారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story