న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  11 July 2020 10:18 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

దేశంలోనే తొలిసారి: తల్లి గర్భంలోనే బిడ్డకు కరోనా పాజిటివ్‌.. తల్లికి నెగిటివ్‌

కరోనా వైరస్‌ ఏ విధంగా సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రకరకాలుగా రూపాంతరం చెబుతూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ వల్ల మనిషి భయాందోళనతో బతకాల్సిన పరిస్థితి నెలకొంది. తల్లి గర్భంలోనే శిశువుకు కరోనా సోకింది. అయితే గర్భిణికి మొదట కరోనా పాజిటివ్‌ రాగా, డెలివరీ అయిన తర్వాత నెగిటివ్‌ వచ్చింది. ఇక శిశువు పుట్టిన ఆరు గంటల తర్వతా బిడ్డకు కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చింది. ఇలాంటి కేసు దేశంలోనే తొలిసారి అని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బయటపడుతున్న సీఐ శంకరయ్య భారీ అక్రమాస్తులు.. ఏసీబీ దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు

పోలీస్‌ ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. లంచాల ముసుగులో ఇళ్లు, భూములు, బంగారం భారీగా కూడబెట్టుకున్నాడు. లంచాలకు మరిగి అడ్డదారులు దొక్కాడు. చివరికి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయాడు. అతనే రంగారెడ్డి జిల్లా షాబాద్ సర్కిల్ ఇన్స్‌ పెక్టర్‌ శంకరయ్య. ఓ భూమి వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బులు డిమాండ్‌ చేసిన శంకరయ్య ఏసీబీకి చిక్కాడు. దీంతో అతని ఆస్తులపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Fact Check : హైదరాబాద్ రోడ్ల మీద కరోనా పాజిటివ్ రోగి అధికారులను ముప్పతిప్పలు పెట్టారా..?

కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే..! అదుపు చేయడానికి అధికారులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొందరు నిబంధనలు పాటించకుండా ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను క్వారెంటైన్ లో ఉంచినప్పటికీ పారిపోతూ ఉండడం అధికారులకు తలపోటుగా మారిపోతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టిన వరుడు.. అదీ కూడా ఒకే వేదిక..

మీది ప్రేమ పెళ్లా..? లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా..? అని అడిగితే.. ఏదో ఒకటి చెబుతారు. అయితే.. ఆ యువకుడు మాత్రం రెండూ అని సమాధానం చెబుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని, పెద్దలు చూసిన అమ్మాయిని ఇద్దరిని పెళ్లిచేసుకున్నాడు. అది కూడా ఒకే మూహూర్తానికి. ఒకే వేదికపై. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలోని కెరియా గ్రామంలో చోటు చేసుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్‌లో కరోనా కరాళనృత్యం.. 24గంటల్లో 27,114 కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైనప్పటి నుంచి ప్రతి నిత్యం వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27,114 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 519 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కేసుల సంఖ్య 8,20,916కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 22,123 మంది మృత్యువాత పడ్డారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తల్లీ.. నీకు వందనం.. 8 మందికి జన్మనిచ్చి.. 9వ కాన్పుకు సిద్ధంగా ఉన్న మాతృమూర్తి

ప్రస్తుతం బతకడమే భారమన్న రోజులివి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి, లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కంటుంటారు. ఎందుకంటే ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ అన్నట్లు ఉంది. దేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న ఖర్చులు.. చదువులు.. ఖర్చుల దృష్ట్యా ఇద్దరిని పెంచి పోషించడమే భారంగా మారింది. అలాంటిది ఓ మహిళ ఏకంగా 8 మందికి జన్మనిచ్చి 9వ కాన్పుకు సిద్ధమవుతోంది. తొమ్మిదో నెల పరీక్ష చేయించుకునేందుకు శుక్రవారం ఆస్పత్రికి వచ్చింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

స్విమ్ సూట్ తో హీటు పెంచేసిన అనుష్క.. విరాట్ కోహ్లీ రిప్లై చూశారా..?

అనుష్క శర్మ ప్రస్తుతం తన క్వారెంటైన్ ను భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తాము ఏయే పనులను చేస్తున్నామో ఎప్పటికప్పుడు విరుష్క జంట అభిమానులతో పంచుకుంటూ ఉంది. తాజాగా అనుష్క శర్మ మేగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. స్విమ్ సూట్ లో కనిపించిన అనుష్క శర్మను చూసి విరాట్ కోహ్లీ కూడా ఇంప్రెస్ అయ్యాడు. అనుష్క శర్మ ఆ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేయగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వికెట్‌ తీసిన ఆనందంలో.. నిబంధనలను మరిచాడు

దాదాపు మూడు నెలల విరామం తరువాత వెస్టిండిస్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. బుధవారం ప్రారంభం అయిన ఈ మ్యాచ్‌తో ఐసీసీ కరోనా నిబంధనలను తీసుకువచ్చింది. ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాలని, బంతిపై ఉమ్మి వాడకూడదని, కరచాలనం చేయవద్దని వంటివి ఉన్నాయి. కాగా.. మ్యాచ్‌ మూడవ రోజు ఆటలో ఇంగ్లాండ్‌ ఆటగాడు జేమ్స్‌ అండర్సన్‌ ఓ నిబంధనను బ్రేక్‌ చేశాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారతీయులకు సహాయం చేయడానికి ప్లాస్మా దానం చేసిన న్యూజిలాండ్ యుట్యూబర్

న్యూ ఢిల్లీ : కార్ల్ రాక్.. న్యూజిలాండ్ కు చెందిన ఓ యుట్యూబర్ గత మూడేళ్లుగా భారత్ లోనే నివాసం ఉంటున్నాడు. అతడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనస్ఫూర్తిగా అభినందించాడు. అందుకు కారణం తన ప్లాస్మాను దానం చేయడమే..! కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతూ ఉంది. దీంతో ప్లాస్మా దానం చేయాలని ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారిని కోరుతూ ఉన్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బుట్ట బొమ్మ.. రికార్డులు ఆగకూడదమ్మా..!

త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సాంగ్స్, వీడియో సాంగ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాములో రాములా, బుట్ట బొమ్మ, సామజవరగమణా పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story