స్విమ్ సూట్ తో హీటు పెంచేసిన అనుష్క.. విరాట్ కోహ్లీ రిప్లై చూశారా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2020 5:46 AM GMT
స్విమ్ సూట్ తో హీటు పెంచేసిన అనుష్క.. విరాట్ కోహ్లీ రిప్లై చూశారా..?

అనుష్క శర్మ ప్రస్తుతం తన క్వారెంటైన్ ను భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తాము ఏయే పనులను చేస్తున్నామో ఎప్పటికప్పుడు విరుష్క జంట అభిమానులతో పంచుకుంటూ ఉంది. తాజాగా అనుష్క శర్మ మేగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. స్విమ్ సూట్ లో కనిపించిన అనుష్క శర్మను చూసి విరాట్ కోహ్లీ కూడా ఇంప్రెస్ అయ్యాడు. అనుష్క శర్మ ఆ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేయగా.. విరాట్ కోహ్లీ కింద కామెంట్ పెట్టాడు. కళ్ళలో లవ్ సింబల్ ఉన్న ఈమోజీని పోస్టు చేశాడు. వోగ్ మ్యాగజైన్ కోసం అనుష్క శర్మ ఈ ఫోటో షూట్ లో పాల్గొంది.

“The cool breeze , the steady waves , some sand on my skin , the sun on back and salty hair . It was a good day,” అంటూ మొదటి ఫోటోను అప్లోడ్ చేసిన అనుష్క శర్మ. రెండో ఫొటోకు “For shore!” అంటూ క్యాప్షన్ ను పెట్టింది. బ్లూ టాప్ లో అనుష్క స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.

కామెంట్స్ సెక్షన్ లో విరాట్ కోహ్లీ హార్ట్, ఫైర్ ఈమోజీలను అప్లోడ్ చేశారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా కామెంట్లు పెట్టారు. భూమీ పెడ్నేకర్, మౌని రాయ్, రకుల్ ప్రీత్ సింగ్, శాన్య మల్హోత్రాలు కామెంట్లు చేశారు.

అనుష్క శర్మను హీరోయిన్ గా చూసి చాలా రోజులే అవుతోంది. ప్రస్తుతం అనుష్క శర్మ నిర్మాతగా చాలా బిజీగా ఉంది. క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ పతాకంపై తన సోదరుడు కర్ణేశ్ శర్మతో కలిసి సినిమాలను నిర్మిస్తోంది అనుష్క శర్మ. ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లో అనుష్క నిర్మించిన పాతాళలోక్ వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ ఎన్నో వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఇక నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న సూపర్ న్యాచురల్ డ్రామా బుల్ బుల్ ను కూడా అనుష్క శర్మనే నిర్మించింది.

Next Story