బుట్ట బొమ్మ.. రికార్డులు ఆగకూడదమ్మా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 9:01 AM GMT
బుట్ట బొమ్మ.. రికార్డులు ఆగకూడదమ్మా..!

త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సాంగ్స్, వీడియో సాంగ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాములో రాములా, బుట్ట బొమ్మ, సామజవరగమణా పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి.

ఇక యూట్యూబ్ లో వీడియో సాంగ్స్ విడుదలయ్యాక పాటలకు ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది. బుట్టబొమ్మ వీడియో సాంగ్ ను తెగ చూస్తూ ఉన్నారు. మిలియన్ల మీద మిలియన్ల వ్యూస్ యుట్యూబ్ లో బుట్టబొమ్మకు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఆ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాలీవుడ్ స్టార్స్ ను కూడా అమితంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ 'బుట్ట‌బొమ్మ' పాట‌ 260 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును అందుకుంది. తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌గా చరిత్ర లిఖించింది. అంతేకాదు, ఈ వీడియోకు 1.9 మిలియ‌న్స్ లైకులు వచ్చాయి. ఈ విషయాలను తెలుపుతూ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టర్‌ పోస్ట్ చేసింది.తమన్ అందించిన సంగీతం ఈ రేంజి హిట్ అవుతుందని అసలు ఊహించలేదు. తెలుగు సినిమా పాటలు ఇంత పెద్ద హిట్ అవుతాయా అన్నది చాలా గొప్ప విషయమే..! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ మొబైల్, కంప్యూటర్, స్మార్ట్ టీవీలలో ఓ సారి చూసేయండి.

Next Story